నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు | - | Sakshi
Sakshi News home page

నేలకొరిగిన భారీ వృక్షాలు, విద్యుత్తు స్తంభాలు

May 29 2026 10:14 AM | Updated on May 29 2026 10:14 AM

పెదపూడి: మండలంలో చింతపల్లి – జి.మామిడాడ గ్రామాల మధ్య ఆర్‌అండ్‌బీ రోడ్డులో గురువారం ఉదయం వీచిన ఈదురు గాలులకు సుమారు 50 భారీ వృక్షాలు, 20 విద్యుత్తు స్తంభాలు నేల కూలాయి. దీంతో, ఉదయం 10 గంటల నుంచి ప్రయాణికుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఏర్పడ్డాయి. గాలుల తాకిడికి రాజుపాలెం, గండ్రేడు గ్రామాల్లో రెండు విద్యుత్‌ ట్రాన్స్‌ఫార్మర్లు దెబ్బ తిన్నాయి. ఫలితంగా రాజుపాలెం, పైన, వేండ్ర గ్రామాల్లో విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యుత్‌ అధికారులు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుని, సాయంత్రానికి సరఫరాను పునరుద్ధరించారు. డిప్యూటీ ఎంపీడీఓ మేడపాటి సత్యనారాయణరెడ్డి ఆధ్వర్యాన గ్రామ పంచాయతీ, ఇతర అధికారులు, స్థానికుల సహాయంతో రోడ్డుపై విరిగి పడిన భారీ వృక్షాలను తొలగించారు.

Advertisement
 
Advertisement
Advertisement