దేశవ్యాప్తంగా జరుగుతున్న అభివృద్ధి పనుల్లో భాగంగా సామర్లకోటకు అమృత భారత్ స్టేషన్ నిధులు రూ.25 కోట్ల వరకూ మంజూరయ్యాయి. ప్రాధాన్య క్రమంలో కొన్ని రైల్వే స్టేషన్లలో పనులు నిర్వహిస్తున్నారు. దీంతో, ఇక్కడి పనుల్లో కొంత వరకు జాప్యం జరుగుతోంది. రెండు, మూడు విడతల్లో నిధులు వస్తాయి. ఎస్కలేటర్ నిర్మించే చోట మూడు బోగీలకు చెందిన డిస్‌ప్లే బోర్డులు తొలగించారు. దీంతో, రైళ్లు వచ్చే సమయంలో బోగీల వివరాలను మైకులో ప్రకటిస్తున్నాం. ఎస్కలేటర్ పనులు జరుగుతున్న ప్రదేశంలోని బోగీల సమాచారంపై ప్రత్యేకంగా ప్రచారం చేయిస్తాం. పార్కింగ్ స్టాండ్ నిర్వాహకుడు షెడ్ల కోసం దరఖాస్తు చేస్తే డీఆర్‌ఎంకు పంపుతాం.
– ఎం.రమేష్, మేనేజర్, సామర్లకోట రైల్వే స్టేషన్


