సత్యదేవుని దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్‌ సీజే రమేష్‌ సిన్హా | - | Sakshi
Sakshi News home page

సత్యదేవుని దర్శించుకున్న ఛత్తీస్‌గఢ్‌ సీజే రమేష్‌ సిన్హా

May 27 2026 12:11 AM | Updated on May 27 2026 12:11 AM

తొండంగి: ఛత్తీస్‌గఢ్‌ హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌ రమేష్‌ సిన్హా రత్నగిరిపై మంగళవారం సత్యదేవుని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. కుటంబ సభ్యులతో వచ్చిన ఆయనకు దేవస్థాన అర్చకులు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం సత్యదేవుని వ్రతం ఆచరించి ప్రధానాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. దేవస్థానం వేద పండితులు జస్టిస్‌ రమేష్‌ సిన్హా దంపతులకు పండితాశీర్వచనం చేయగా దేవస్థానం ఈవో నల్లం సూర్యచక్రధర్‌రావు సత్యదేవుని ప్రసాదం, ఫొటోను అందజేశారు. ఆయన వెంట ఏపీఆర్వో గణపతి, ఇతర అధికారులు, సిబ్బంది ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement