జ్యోతిలక్ష్మీదేవికి రాష్ట్ర స్థాయి అవార్డు | - | Sakshi
Sakshi News home page

జ్యోతిలక్ష్మీదేవికి రాష్ట్ర స్థాయి అవార్డు

May 27 2026 12:11 AM | Updated on May 27 2026 12:11 AM

అమలాపురం రూరల్‌: సాంఘిక సంక్షేమ శాఖ జిల్లా అధికారి పి.జ్యోతిలక్ష్మీదేవికి రాష్ట్రస్థాయిలో టాప్‌ ఫెర్పార్మర్‌ అవార్డు లభించింది. సాంఘిక సంక్షేమ శాఖ హాస్టల్లో చదువుకున్న విద్యార్థులు ఇంటర్‌, పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో నూరుశాతం ఉత్తీర్ణత సాధించినందుకు ఈ అవార్డు దక్కింది. ఈ మేరకు మంగళవారం ఆమెకు డివిజన్‌ సంక్షేమ అధికారులు భగవాన్‌, సత్యనారాయణ, వసతి గృహ సంక్షేమ శాఖ అధికారులు, సంఘం జిల్లా అధ్యక్షుడు కె.ప్రవీణ్‌, కోశాధికారి బీఎంవీ సత్యనారాయణ, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ 4వ తరగతి ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ఎ.రమేష్‌బాబు అభినందనలు తెలిపారు. జ్యోతిలక్ష్మీదేవి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సాంఘిక సంక్షేమ శాఖ సిబ్బంది, ఉద్యోగుల కృషి ఫలితంగా తనకు అవార్డు దక్కిందని స్పష్టం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement