చేనేతను ప్రోత్సహించాలి | - | Sakshi
Sakshi News home page

చేనేతను ప్రోత్సహించాలి

May 26 2026 3:20 AM | Updated on May 26 2026 3:20 AM

బోట్‌క్లబ్‌: చేనేతను ప్రతి ఒక్కరూ ప్రోత్సహించాలని కలెక్టర్‌ హరేంధిరప్రసాద్‌ అన్నారు. స్థానిక ఎస్‌ఆర్‌ఎంటీ ఫంక్షన్‌ హాల్‌లో ఈ నెల 25 నుంచి జూన్‌ 1 వరకు చేనేత, జౌళిశాఖ ఆధ్వర్యంలో నిర్వహించే వస్త్ర ప్రదర్శనను సోమవారం ఆయన జ్యోతి వెలిగించి ప్రారంభించారు. రోజూ ఉదయం 11 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందన్నారు. 80 స్టాల్స్‌లో కాటన్‌, మెర్సిడైజేడ్‌, పట్టుచీరలు, సీకో చీరలు, మాధవరం, వెంకటగిరి, బందరు జరీ చీరలు, మంగళగిరి డ్రెస్‌ మెటీరియల్స్‌, ఉప్పాడ జంధాని చీరలు, కలంకారి వస్త్రాలు, పొందూరు ఖద్దరు, పెద్దాపురం సిల్క్‌ షర్టింగ్స్‌, ప్రఖ్యాతిగాంచిన బెడ్‌ షీట్స్‌, ఆకర్షణమైన వస్త్ర ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయన్నారు. జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి కె.పెద్దిరాజు పాల్గొన్నారు.

పెద్దాపురం ఆర్డీఓగా

రాధాకృష్ణమూర్తి

సామర్లకోట : పెద్దాపురం ఆర్డీఓగా రాధాకృష్ణమూర్తిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. సామర్లకోట మండలం వేట్లపాలెంలో జరిగిన బాణసంచా పేలుళ్ల ఘటనకు సంబంధించి బాధ్యులుగా చేస్తూ అప్పటి ఆర్డీఓగా ఉన్న కే శ్రీరమణని సస్పెండ్‌ చేసిన విషయం విదితమే. అనంతరం ఎన్‌ శ్రీధర్‌ను ఇన్‌చార్జిగా నియమించారు. రెగ్యులర్‌ ఆర్డీఓగా రాధాకృష్ణమూర్తిని నియమించారు.

ఉత్సాహంగా రేలా ఉత్సవాలు

రంపచోడవరం: ఆదివాసీ రేలా ఉత్సవాలు రెండో రోజు ఉత్సహంగా జరిగాయి. రేలా ఉత్సవాలకు జిల్లా కలెక్టర్‌ కె.దినేష్‌కుమార్‌, జేసీ ప్రశాంత్‌కుమార్‌ హాజరయ్యారు. గిరిజనులతో కలసి ఉత్సాహంగా నృత్యాలు చేశారు. సాయంత్రం ఏడు గంటలకు రేలా ఉత్సవాలు ప్రారంభించారు.

Advertisement
 
Advertisement
Advertisement