అసమర్థ పాలనకు నిదర్శనం | - | Sakshi
Sakshi News home page

అసమర్థ పాలనకు నిదర్శనం

May 26 2026 3:20 AM | Updated on May 26 2026 3:20 AM

రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు కానీ పెట్రోల్‌ డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. నియంత్రణకు కమిటీని వేయాలి. ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏపీలో ధరలు ఎందుకు ఎక్కువ. ఇది కూటమి అసమర్థ పాలనకు నిదర్శనం.

– కర్నాకుల వీరాంజనేయులు, ప్రధాన కార్యదర్శి. ఆంధ్రప్రదేశ్‌ రైతు కూలి సంఘం,

వాహనదారులు ఏమైపోవాలి

ఈ పరిస్థితి చూస్తుంటే లీటర్‌ పెట్రోలు ధర రూ.130 దాటిపోతుందేమోనని ఆందోళనగా ఉంది. వాహనదారులు ఏమైపోవాలి. చంద్రబాబు ప్రభుత్వం ధరల నియంత్రణపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు.

– నేతల హరిబాబు,

మాజీ కౌన్సిలర్‌, సామర్లకోట

ఎన్నికలు అవ్వగానే పెంచేసింది

రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న సమయంలో పెంచకుండా ఎన్నికల అయిన వెంటనే కేంద్రం ధరంలు పెంచేసింది. ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న ధరల నియంత్రణ చర్యలు, రాయితీలు ఆంధ్రప్రదేశ్‌లో లేకపోవడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనం.

– తాటిపాక మధు,

సీపీఐ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు

నిత్యావసరాలు ఆకాశాన్నంటుతాయి

ఈ ధరలు పెరుగుదలతో నిత్యావసరాలు ఆకాశాన్నంటే పరిస్థితి ఏర్పడుతోంది. అధికారంలోకి వస్తే పెట్రోల్‌ ధరలు పెంచమని ప్రగల్భాలు పలికిన మంత్రి లోకేష్‌ ప్రస్తుతం పెరుగుతున్న ధరలపై ఎందుకు స్పందించడం లేదు.

– బి సిద్దు, పీడీఎస్‌యూ

రాష్ట్ర సహాయ కార్యదర్శి, కాకినాడ

Advertisement
 
Advertisement
Advertisement