వ్యవసాయ భూమికి సంబంధించిన మగతా డబ్బు ఇవ్వడం లేదు. ఇదే విషయంపై స్థానికంగా ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. 2025లో తన వద్ద ఎకరం భూమి మగతాకు తీసుకొని డబ్బు ఇవ్వకుండా మా గ్రామానికి చెందిన బుర్తి కృష్ణంరాజు ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బు ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బెంగతో నా భార్య వీరయ్యమ్మ మృతి చెందింది. నాకు న్యాయం చేయాలి.
– దడాల పామురాజు, కోదాడ, తొండంగి మండలం.
రెండేళ్లుగా తిరుగుతున్నా
నాకు ప్రమాదం సంభవించడంతో రెండు కాళ్లూ సక్రమంగా పనిచేయడం లేదు. పింఛన్ కోసం రెండు సంవత్సరాలుగా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడం లేదు. సర్టిఫికేట్ ఉంటే గానీ పింఛన్ ఇవ్వడం కుదరదని సచివాలయ అధికారులు చెబుతున్నారు. సమస్యల పరిష్కారం కోసం తరచూ తిరగడం ఇబ్బందిగా ఉంది.
– బల్లిపాటి శివాజీ, పిఠాపురం
నా కుమార్తెకు
ప్రాణదానం చేయండి
నా కుమార్తె ఐశ్వర్యలక్ష్మికి చిన్నతనంలోనే లివర్ సమస్య వచ్చింది. గత ఏడాది నుంచి అధికారులు చుట్టూ తిరుగుతున్నాను. చికిత్సకు రూ.40 లక్షల వరకూ ఖర్చవుతుందని వైద్యులు చెబుతున్నారు. కానీ ప్రభుత్వం రూ.10 లక్షలు మాత్రమే ఆర్యోగ్యశ్రీలో మంజూరు చేసింది. మిగిలిన డబ్బు కూడా మంజూరు చేస్తే హైదరాబాద్‌లో ఆపరేషన్ చేయించుకొని నా కుమార్తెను బతికించుకొంటాను.
– ఎ చిన్ని, సామర్లకోట పట్టణం.


