● వైఎస్సార్ సీపీ శ్రేణులు, బీఎల్‌ఏలు
అప్రమత్తంగా ఉండాలి
● పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా,
మాజీ మంత్రి కన్నబాబు
● రూరల్ నియోజకవర్గ బూత్
కమిటీల విస్తృత స్థాయి సమావేశం
కాకినాడ రూరల్: ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) పేరుతో వైఎస్సార్ సీపీకి చెందిన ఓట్లు తొలగించే అవకాశం ఉన్నందున పార్టీ శ్రేణులు, బూత్ కమిటీ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా, మాజీ మంత్రి కురసాల కన్నబాబు కోరారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాకినాడ ఐదు బిల్డింగ్ సెంటర్ సమీపంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో శనివారం పార్టీ రూరల్ నియోజకర్గ కో ఆర్డినేటర్ కురసాల కన్నబాబు అధ్యక్షతన బూత్ కమిటీలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. సమావేశానికి దాడిశెట్టి రాజా ముఖ్య అతిథిగా హాజరై రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని, అన్ని వ్యవస్థలు దెబ్బతిన్నాయన్నారు. సూపర్ సిక్స్ హామీల అమలులో విఫలమవ్వడంతో ప్రజల నుంచి వ్యతిరేకత వస్తోందన్నారు. ఈ క్రమంలో చంద్రబాబు తన అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు, కార్యకర్తలు, నాయకుల ఓట్లు తొలగించే ప్రమాదం ఉందన్నారు. పార్టీ నియోజకవర్గ కో ఆర్డినేటరు, ఉమ్మడి విశాఖపట్నం, విజయనగరం రీజినఅల్ కో ఆర్డినేటరు కురసాల కన్నబాబు మాట్లాడుతూ వచ్చే నెల నుంచి ‘సర్’ జరుగుతుందని, బూత్ స్థాయి అధికారులు వారి పరిధిలోని ఇళ్లకు వచ్చి ఓటర్ల జాబితాలు పరిశీలిస్తారన్నారు. మన పార్టీ తరఫున బీఎల్‌ఓలు అప్రమత్తంగా ఉండి పారదర్శకంగా జరిగేలా చూడాలన్నారు. నియోజకవర్గంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు బీఎల్‌ఏలకు సహకరిస్తారని, అధికార పార్టీ ఒత్తిడితో ఓట్లు తొలగిస్తే పోరాడాల్సి ఉంటుందని అన్నారు. చంద్రబాబు, లోకేష్ కలిసి జగన్‌మోహన్‌రెడ్డిపై చేస్తున్న దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున తిప్పికొట్టాలని కన్నబాబు పిలుపు ఇచ్చారు. జిల్లా టాస్క్ ఫోర్స్ సభ్యులు బీవీఆర్ చౌదరి పార్టీ నాయకులు, కార్యకర్తలు, బీఎల్‌ఏలకు ఎస్‌ఐఆర్ నిర్వహణలో వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో కాకినాడ పార్లమెంట్ పరిశీలకుడు దాట్ల సూర్యనారాయణరాజు, రూరల్ నియోజవర్గ పరిశీలకుడు కొప్పన శివనాఽథ్, జిల్లా టాస్క్‌ఫోర్స్ సభ్యుడు వాసిరెడ్డి జమీలు, జెడ్పీటీసీ, రూరల్ మండల పార్టీ అధ్యక్షుడు నురుకుర్తి రామకృష్ణ, పార్టీ ఎస్‌ఈసీ సభ్యులు బెజవాడ సత్యనారాయణ, నాగఫణిబాబు, పార్టీ మహిళా విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షురాలు జమ్మలమడక నాగమణి, నాయకులు కొప్పిశెట్టి గణేష్, రామదేవు సూర్య ప్రకాశరావు, చింతా ఈశ్వరరావు, పెంకే సత్తిబాబు, పంతం ఇందిరా, పి.సరోజ, శివకుమారి, సరబాబు తదితరులు పాల్గొన్నారు.


