రహదారి భద్రతపై సమ్మేళనం
బాలాజీచెరువు: జేఎన్‌టీయూ కాకినాడలో శనివారం రాష్ట్ర రహదారి భద్రత అడిట్ అంశంపై ప్రత్యేక సాంకేతిక సమ్మేళనం నిర్వహించారు. ఈ సమ్మేళనంలో ఆర్‌అండ్‌బీ, జాతీయ రహదారుల సంస్థ అఽధికారులు, జేఎన్‌టీయూకే ప్రొఫెసర్లు పాల్గొని రహదారి రూపకల్పనలో లోపాలు, నిర్మాణ ప్రమాణాలు, ట్రాఫిక్ ఇంజినీరింగ్, బ్లాక్‌స్పాట్, ప్రమాదాల నివారణకు ఆధునిక సాంకేతికతతో పరిష్కారాలు అనే అంశాలపై చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర, జాతీయ రహదారులపై ప్రమాదాలకు కారణమవుతున్న బ్లాక్‌స్పాట్‌లను శాసీ్త్రయంగా గుర్తించి ఇంజినీరింగ్ మార్పులు చేయడం వల్ల ప్రమాదాల తీవ్రతను గణనీయంగా తగ్గించవచ్చని అభిప్రాయపడ్డారు. ఈ సమ్మేళనంలో జేఎన్‌టీయూకే వీసీ సీఎస్‌ఆర్‌కే ప్రసాద్, డీటీసీ కే.శ్రీధర్, మాజీ వీసీ జీవీఆర్ ప్రసాదరాజు, డీఎస్పీ శ్రీనివాసరావు ఏంవీఐ హరినాథరెడ్డి, డాక్టర్ పద్మావతి పాల్గొన్నారు.
రష్యాలో ఉద్యోగ అవకాశాలు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్, ఓవర్‌సీస్ మ్యాన్ పవర్ ఆధ్వర్యంలో ఐటీఐ ఉత్తీర్ణులైన అభ్యర్థులకు రష్యాలో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నట్లు స్కిల్ డెవలప్‌మెంట్ అధికారి ఎస్.గోపీకృష్ణ శనివారం ప్రకటనలో తెలిపారు. ఐటీఐ షీట్ మెటల్ వర్క్, ఫిట్టర్, మెషినిస్ట్, వెల్డర్, మెటలర్జ్, మెకానికల్ ఇంజినీరింగ్‌లో డిప్లమా కలిగిన, 25 సంవత్సరాలు అంతకంటే ఎక్కువ వయసు గలవారు అర్హులన్నారు. ఎంపికై న వారికి రూ.72,586 జీతంతో పాటు రూ.12,098 ఆహార భత్యం ఇస్తారన్నారు. వివరాలకు 99888 53335 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
జాతీయ స్థాయి బేస్‌బాల్ పోటీలకు అలేఖ్య
కాజులూరు: జాతీయ స్థాయి బేస్ బాల్ పోటీలకు కాజులూరు మండలం గొల్లపాలెం జెడ్పీ హైస్కూల్‌కు చెందిన వింత అలేఖ్య ఎంపికై ంది. ఈ మేరకు శనివారం పాఠశాలలో స్కూల్ హెచ్‌ఎం ఎస్‌ఎస్‌బీ సుశీలమణి ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. పీడీ జి.సునీల్‌కుమార్ మాట్లాడుతూ కడప జిల్లా రైల్వేకోడూరులో నవంబర్ 15 నుంచి 17 వరకూ ఎస్‌జీఎఫ్ అండర్ – 19 రాష్ట్ర స్థాయి బేస్‌బాల్ పోటీలు జరిగాయన్నారు. వాటిలో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా జట్టులోని తమ తొమ్మిదో తరగతి విద్యార్థిని వింత అలేఖ్య చక్కని ప్రతిభ కనపరిచి, జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. ఢిల్లీలో జనవరి 31 నుంచి ఫిబ్రవరి 3 వరకూ జరిగే జాతీయ స్థాయి పోటీల్లో రాష్ట్ర టీమ్ తరఫున పోటీపడుతుందన్నారు.
మహిళ మృతి
తాళ్లరేవు: స్థానికంగా ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తాళ్లరేవు శ్రీరామ్‌నగర్‌లో కాలాడి సీత (55), అక్కడి రత్సవారిపేటకు చెందిన ధనకాసులతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తుంది. వారికి ఒక కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం ఫిట్స్ రావడంతో కుప్పకూలి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా సీత అనారోగ్యంతో ఉందన్నారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఇలా ఉండగా కుటుంబ సభ్యులు మాత్రం సీత ముఖంపై గాయాలు ఉన్నాయని, ఎవరో హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. పూర్తిగా విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఐకు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో క్లూస్ టీంను రప్పించి విచారణ చేపడతామని ఆయన తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు నిర్వహించాలని ఎస్‌ఐ సత్యనారాయణను ఆదేశించారు.
అంతర్వేది మహోత్సవాలకు ప్రత్యేక బస్సులు
అమలాపురం రూరల్: అంతర్వేది లక్ష్మీనరసింహస్వామి కల్యాణ మహోత్సవాల సందర్భంగా ఈ నెల 28, 29, ఫిబ్రవరి 2వ తేదీల్లో ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆర్టీసీ జిల్లా ప్రజా రవాణాఅధికారి ఎం.శ్రీనివాసరావు తెలిపారు. అమలాపు రం, రాజోలు, రావులపాలెం డిపోల నుంచి అంతర్వేదికి 75 ప్రత్యేక సర్వీసులు నడుపుతామని, అలాగే పశ్చిమగోదావరి జిల్లా భీమవరం, నర్సాపురం డిపోల నుంచి 50 బస్సులు తిరుగుతాయన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని అదనంగా ప్రత్యేక బస్సులు ఏ ర్పాటు చేస్తామన్నారు. అమలాపురం నుంచి అంతర్వేదికి ప్రతి 15 నిమిషాలకు ప్రత్యేక బస్సు సర్వీసు అందుబాటులో ఉంటుందన్నారు. ఫిబ్రవరి 2వ తేదీన జరిగే చక్ర స్నానం సందర్భంగా ప్రత్యే క బస్సులు నడపడం జరుగుతుందన్నారు. వివరాలకు అమలాపురం డిపో ఎంకై ్వరీ సెల్ నెంబర్ 99592 25550ను సంప్రదించాలన్నారు.


