వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య
సామర్లకోట: స్థానిక సాయినగర్‌లో నివాసం ఉంటున్న ఓ వ్యక్తి ప్రైవేట్ బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేక శనివారం తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై కేఎస్‌ఆర్ మూర్తి కథనం ప్రకారం.. సాయినగర్‌కు చెందిన కరణం ఉమామహేశ్వరరావు (44) ఓ ప్రైవేటు బ్యాంకులో ఇల్లు తనఖా పెట్టి అప్పు తీసుకున్నాడు. ప్రతి నెలా వాయిదాలు ఆలస్యంగా చెల్లిస్తున్నారంటూ బ్యాంకు అధికారులు తరచూ హెచ్చరికలు జారీ చేసేవారు. ఈ నేపథ్యంలో ఆ ఇంటికి బ్యాంకు సిబ్బంది తాళం వేశారు. దీంతో మనస్థాపం చెందిన ఉమామహేశ్వరరావు ఆ ఇంటి పక్కనే ఉన్న ఓ గదిలో ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
A¯]l$-Ð]l*-¯é-çܵ-§ýl íܦ†ÌZ ˘
మహిళ మృతి
తాళ్లరేవు: స్థానికంగా ఓ మహిళ అనుమానాస్పదంగా మృతి చెందింది.. కోరంగి ఎస్‌ఐ పి.సత్యనారాయణ, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. తాళ్లరేవు శ్రీరామ్‌నగర్‌లో కాలాడి సీత (55), అక్కడి రత్సవారిపేటకు చెందిన ధనకాసులతో కొన్నేళ్లుగా సహజీవనం చేస్తుంది. వారికి ఒక కుమార్తె ఉంది. శుక్రవారం రాత్రి భోజనం అనంతరం ఫిట్స్ రావడంతో కుప్పకూలి మృతిచెంది ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. కొన్ని రోజులుగా సీత అనారోగ్యంతో ఉందన్నారు. కాకినాడ రూరల్ సీఐ చైతన్యకృష్ణ సంఘటనా స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపించారు. ఇలా ఉండగా కుటుంబ సభ్యులు మాత్రం సీత ముఖంపై గాయాలు ఉన్నాయని, ఎవరో హత్య చేసి ఉంటారని ఆరోపిస్తున్నారు. పూర్తిగా విచారణ చేపట్టి బాధ్యులను కఠినంగా శిక్షించాలని సీఐకు మొరపెట్టుకున్నారు. ఈ నేపథ్యంలో క్లూస్ టీంను రప్పించి విచారణ చేపడతామని ఆయన తెలిపారు. సమీపంలోని సీసీ కెమెరాల ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు నిర్వహించాలని ఎస్‌ఐ సత్యనారాయణను ఆదేశించారు.
భర్త
మృతదేహం
వద్ద
రోదిస్తున్న
భార్య నుంచి వివరాలు
సేకరిస్తున్న
పోలీసు
వేధింపులు భరించలేక వ్యక్తి ఆత్మహత్య


