అలంకారప్రాయంగా..
గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఆర్‌బీకేలు కళకళలాడుతూ ఉండేవి. రైతు లకు విత్తనాలు, ఎరువులు, పురుగు మందులు సాగు కాలమంతా అందుబాటులో ఉండేవి. సాగు విధానాలపై రైతులతో సిబ్బంది సమావేశా లు, అవగాహన సదస్సులు నిర్వహించేవారు. రైతుల కు సంక్షేమ పథకాలతో పాటు పంట నష్టపరిహారం, ఇన్సూరెన్సు అందజేత వంటి అనేక సేవలు అందించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వంలో ఆర్‌ఎస్‌కేలు అలంకారప్రాయంగా మారి వెలవెలబోతున్నాయి. – లంక ప్రసాద్, వైఎస్సార్ సీపీ
రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు
ఏ సేవా అందడం లేదు
జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వంలో రైతులకు ఆర్‌బీకే భరోసాగా నిలిచింది. ఒక ప్రభుత్వం ప్రారంభించిన మంచి పథకాన్ని అధికారంలోకి వచ్చిన మరో ప్రభుత్వం మార్చుకుంటూ, నిర్వీర్యం చేస్తూ పోవడం సరి కాదు. ఆర్‌బీకేల పేరును చంద్రబాబు ప్రభుత్వం రైతు సేవా కేంద్రాలుగా మార్చినప్పటికీ అక్కడ రైతులకు ఎటువంటి సేవలూ అందించడం లేదు.
– వెలమర్తి బులిరాజు, రైతు,
వీకే రాయపురం, సామర్లకోట మండలం
యథాతథంగా
కొనసాగించాలి
కూటమి ప్రభుత్వం కొలువుదీరాక ఆర్‌ఎస్‌కేల ద్వారా రైతులకు సేవలు సరిగ్గా అందడం లేదు. వీటిపై నిర్లక్ష్యం తగదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా ప్రజలకు మేలు చేసే పథకాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలి. ఆర్‌ఎస్‌కేల సేవల విషయంలో ప్రభుత్వం చొరవ తీసుకోవాలి.
– దాసరి చిన్నబాబు, వైఎస్సార్ సీపీ
రైతు విభాగం రాష్ట్ర కార్యదర్శి, గోకవరం
అలంకారప్రాయంగా..
అలంకారప్రాయంగా..


