విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం | - | Sakshi
Sakshi News home page

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం

Jan 23 2026 6:51 AM | Updated on Jan 23 2026 6:51 AM

విఘ్న

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం

క్లుప్తంగా

స్కూల్‌ బస్సు ఢీకొని ఉపాధ్యాయుడికి గాయాలు

విఘ్నేశ్వర స్వామికి జలాభిషేకం చేస్తున్న వేద పండితులు

అయినవిల్లి విఘ్నేశ్వరస్వామి సన్నిధిలో సప్తనదీ జలాల కలశాలతో వేద పండితులు

అయినవిల్లి: స్థానిక విఘ్నేశ్వర స్వామి ఆలయంలో చదువుల పండుగ పేరుతో మూడు రోజులు పాటు జరిగే ప్రత్యేక క్రతువులకు వేద పండితులు గురువారం అంకురార్పణ చేశారు. ఈ మేరకు ఆలయాన్ని వివిధ పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించారు. తొలిరోజు స్వామివారికి ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు ఆధ్వర్యంలో 12 మంది రుత్విక్కులు సప్తనదీ జలాభిషేకం, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. గంగ, యమున, సరస్వతి, కావేరి, నర్మద, సింధూ, గోదావరి జలాలు ప్రత్యేక కలశాల్లో నింపి పూజలు చేశారు. అనంతరం స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. ఆలయ ఈఓ, ఆలయ అసిస్టెంట్‌ కమిషనర్‌ ముదునూరి సత్యనారాయణరాజు పర్యవేక్షణలో ఈ పూజలు జరిగాయి. శుక్రవారం చదువుల పండుగ పేరుతో శ్రీపంచమి సందర్భంగా సరస్వతీదేవికి ప్రత్యేక పూజలు చేస్తామని ఆలయ ప్రధానార్చకుడు మాచరి వినాయకరావు తెలిపారు. చిన్నారులకు సామూహిక అక్షరాభ్యాసాలు నిర్వహిస్తామన్నారు. అనంతరం స్వామివారి పాదాల చెంత లక్ష కలాలు ఉంచి పూజలు చేస్తామన్నారు.

ట్యాంకర్‌ను లాగేందుకు అష్టకష్టాలు

లోక్‌ అదాలత్‌ను

విజయవంతం చేయండి

ఆల్కాట్‌తోట (రాజమహేంద్రవరం రూరల్‌): మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని బీమా సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల న్యాయవాదులకు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌, జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత సూచించారు. గురువారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని ఏడో జడ్జి చాంబర్‌లో వివిధ బీమా సంస్థల ప్రతినిధులు, ఆయా సంస్థల న్యాయవాదులతో సమావేశం నిర్వహించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి ఎన్‌.శ్రీలక్ష్మి మాట్లాడుతూ మార్చి 14న నిర్వహించనున్న జాతీయ లోక్‌ అదాలత్‌లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించి బాధితులకు తగిన పరిహారం అందించే దిశగా తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఆయా బీమా సంస్థలకు సంబంధించి పెండింగ్‌లో ఉన్న కేసుల జాబితాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థకు అందజేయాలని సూచించారు. అలాగే రాజీ పడదగిన అన్ని ఇతర కేసులను గుర్తించి, వాటిని లోక్‌ అదాలత్‌ ద్వారా సత్వర పరిష్కారం దిశగా తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు.

తొండంగి: మండలంలోని పీబీసీ కాలువకు అనుసంధానంగా పంట కాలువలో స్పిరిట్‌ ట్యాంకర్‌ బోల్తా పడిన నేపథ్యంలో కాలువ నుంచి దానిని వెలికి తీసేందుకు అధికారులు అష్టకష్టాలు పడుతున్నారు. సుమారు 60 టన్నుల వరకూ ఉండే ట్యాంకర్‌ను తీసేందుకు రెండు రోజులుగా జేసీబీలు వంటివి తీసుకొచ్చినప్పటికీ బయటకు తీసే వీలులేక వెళ్లిపోతున్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలో దుర్వాసన వస్తుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బోల్తా పడిన లారీని వెలికి తీసే పనులు మూడో రోజూ కూడా కొనసాగనున్నాయి. ట్యాంకర్‌లో ఉన్న స్పిరిట్‌ను కాలువలో వదిలి ఖాళీ ట్యాంకర్‌ను బయటకు తీస్తారా, లేక స్పిరిట్‌ వల్ల పంట కాలువ, పక్కనే ఉన్న పీబీసీ కాలువ నీరు కలుషితంగా కాకుండా ఏవిధమైన చర్యలు తీసుకుంటారో తెలియాల్సి ఉంది.

నేడు బస్‌ సర్వీసుల రద్దు

రాజవొమ్మంగి: ఏలేశ్వరం డిపో నుంచి పోలవరం, అల్లూరి జిల్లాలకు తిరిగే ఆర్టీసీ బస్‌ సర్వీసులను పోలీసు అధికారుల ఉత్తర్వుల మేరకు శుక్రవారం నిలిపి వేస్తున్నట్లు ఏలేశ్వరం డిపో మేనేజర్‌ సత్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. అడ్డతీగల మండలం గొంతువానిపాలెం – రమణయ్యపేట గ్రామాల మధ్య అధ్వానంగా ఉన్న రహదారికి మరమ్మతులు చేయాలంటూ గురువారం ప్రజలు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఈ కారణంగా అడ్డతీగల, రాజవొమ్మంగి, వై.రామవరం, నర్సపట్నం, కొయ్యూరు మండలాలకు బస్సు సర్వీసులను నిలిపివేశారు. కాగా శుక్రవారం కూడా ఆయా ప్రాంతాలకు బస్సు సర్వీసులను నిలిపివేస్తున్నట్లు డిపో మేనేజర్‌ పేర్కొన్నారు.

వివాహిత అదృశ్యంపై కేసు నమోదు

రంగంపేట: వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎస్‌.శివప్రసాద్‌ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రంగంపేట గ్రామానికి చెందిన జుజ్జవరపు వెంకటరమణ పెద్ద కుమార్తె తేజకు, పెద్దాపురం మండలం కట్టమూరు గ్రామానికి చెందిన సూర్యకు 2025లో వివాహమైంది. సంక్రాంతి సందర్భంగా ఈ నెల 12న తేజ రంగంపేటలో తండ్రి ఇంటికి వచ్చింది. 20వ తేదీ అర్ధరాత్రి నుంచి కనిపించడం లేదు. ఆమె ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు చట్టుపక్కల ప్రాంతాలు, బంధువుల ఇళ్ల వద్ద గాలించినా ప్రయోజనం లేకపోవడంతో ఆమె తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై తెలిపారు. ఆమె ఆచూకీ తెలిస్తే 94409 04854, 94407 96538 ఫోన్‌ నంబర్లకు సమాచారం ఇవ్వాలని కోరారు.

నల్లజర్ల: రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి గాయపడ్డాడు. నల్లజర్లలోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌లో ఉపాధ్యాయుడిగా తూర్పుచోడవరానికి చెందిన దాసరి వెంకట సత్యనారాయణ పనిచేస్తున్నారు. ప్రస్తుతం అతను చిన్నాయగూడెంలో నివాసం ఉంటున్నారు. గురువారం విధులు ముగించుకుని బైక్‌పై ఇంటికి వస్తుండగా అచ్చన్నపాలెం వద్ద ఓ స్కూల్‌కు చెందిన బస్సు ఢీకొంది. సత్యనారాయణ ఎడమ కాలిపై నుంచి బస్సు ఎక్కడంతో నుజ్జునుజ్జయ్యింది. హైవే అంబులెన్స్‌లో ఆయనను చికిత్స నిమిత్తం రాజమహేంద్రవరం ఆసుపత్రికి తరలించారు.

రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి

రాజోలు: రోడ్డు ప్రమాదంలో పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లుకు చెందిన షేక్‌ మస్తాన్‌ (45) మృతి చెందాడు. ఈ నెల 21న రాజోలు మండలం పాలగుమ్మి బైపాస్‌ రోడ్డులో నగరం వైపు సైకిల్‌పై వెళ్తున్న షేక్‌ మస్తాన్‌ను గుర్తు తెలియని మోటార్‌ సైకిల్‌ బలంగా ఢీకొంది. దీంతో తలకు తీవ్ర గాయం కావడంతో 108 అంబులెన్స్‌లో రాజోలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం కాకినాడ తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మస్తాన్‌ గురువారం మృతి చెందాడని ఎస్సై రాజేష్‌కుమార్‌ తెలిపారు. ఊరూరా సైకిల్‌పై తిరుగుతూ గ్యాస్‌ స్టౌలు రిపేర్‌ చేస్తూ కుంటుంబాన్ని పోషించుకునే వాడని మస్తాన్‌ సోదరుడు నన్నాషా తెలిపారు. నన్నాషా ఫిర్యాదు మేరకు రాజోలు పోలీసులు కేసు నమోదు చేశారు.

కోలంకలో వ్యక్తి అదృశ్యం

కాజులూరు: కోలంకకు చెందిన పినిపే ప్రసాద్‌ (38) వారం రోజుల నుంచి కనిపించడం లేదు. ఈ మేరకు అతని కుమారుడు సుభాష్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ వివరాల ప్రకారం.. ప్రసాద్‌ భార్య కువైట్‌కు ఉపాధి నిమిత్తం వెళ్లింది. దీంతో అతను రోజూ పొలమూరుపాడులో అత్తవారింటికి వెళ్లి మధ్యాహ్నం, సాయంత్రం భోజనం చేసి తిరిగి కోలంక వస్తుండేవాడు. ఈ నెల 15న సాయంత్రం పొలమూరుపాడులో భోజనం చేసి వెళ్లిన ప్రసాద్‌ తిరిగి కనిపించ లేదు. బంధువులు, స్నేహితుల ఇంటికి వెళ్లి ఉంటాడని కుటుంబీకులు అనుకున్నారు. వారం గడిచినా రాకపోవడంతో గొల్లపాలెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆచూకీ తెలిసిన వారు సెల్‌ నంబరు 96189 06535, గొల్లపాలెం పోలీస్‌ స్టేషన్‌ నంబర్‌ 0884 2335233కు సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు.

వ్యభిచార గృహంపై పోలీసుల దాడి

గోకవరం: గోకవరంలో నిర్వహిస్తున్న ఓ వ్యభిచార గృహంపై పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను, ఇద్దరు విటులను అరెస్టు చేయడంతో పాటు ముగ్గురు బాధిత మహిళలను రక్షించారు. ఎస్సై పవన్‌కుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గోకవరం శివారున మురళీనగర్‌లో ఓ ఇంటిలో ఇద్దరు మహిళలు వ్యభిచార గృహం నిర్వహిస్తున్నారన్న సమాచారంతో బుధవారం రాత్రి దాడి చేశామన్నారు. ఈ దాడిలో ఇద్దరు విటులను, ముగ్గురు బాధిత మహిళలను, ఇద్దరు నిర్వాహకురాళ్లను అదుపులోకి తీసుకున్నామన్నారు. గోకవరానికి చెందిన బద్దిరెడ్డి పద్మ తన ఇంట్లో, రంపయర్రంపాలెం గ్రామానికి చెందిన కట్టమూరి లక్ష్మితో కలిసి వివిధ ప్రాంతాల నుంచి యువతులను తీసుకువచ్చి వ్యభిచార గృహం నిర్వహిస్తున్నట్లు గుర్తించామన్నారు. అక్కడ ఇద్దరు యువతులతో ఉన్న పెద్దాపురం, తాళ్లపూడికి చెందిన ఇద్దరు విటులను అరెస్టు చేసి, మహిళల అక్రమ రవాణా చట్టం కింద కేసు నమోదు చేశామన్నారు. దర్యాప్తులో భాగంగా నిర్వాహకులు, విటులు నలుగురిని రిమాండ్‌ నిమిత్తం గురువారం రాజమహేంద్రవరం కోర్టులో హాజరుపరచగా రిమాండ్‌ విధించారన్నారు. బాధిత మహిళలను కోర్టు అనుమతితో అబ్జర్వేషన్‌ హోమ్‌కి తరలించామన్నారు.

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం1
1/7

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం2
2/7

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం3
3/7

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం4
4/7

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం5
5/7

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం6
6/7

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం7
7/7

విఘ్నేశ్వరునికి సప్త నదీ జలాభిషేకం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement