రెండు బైక్‌ల ఢీ
ఐదుగురికి తీవ్ర గాయాలు
ఎటపాక: మండలంలోని చోడవరం వద్ద 30వ నంబర్ జాతీయ రహదారిపై రెండు బైక్‌లు ఎదురెదురుగా వచ్చి ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఎస్సై అప్పలరాజు కథనం ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్ జిల్లా బయ్యారం గ్రామానికి చెందిన గోవుల వీరభద్రు కుటుంబం ఒడిశాలోని బలిమెలలో రాళ్లుకొట్టే పని చేస్తోంది. వీరభద్రు అతడి భార్య శారద, ఇద్దరు కుమారులు అభి, విజయ్‌లు బలిమెల నుంచి బైక్‌పై తమ స్వగ్రామం వెళ్తున్నారు. ఈ క్రమంలో ఎటపాక మండలం గౌరిదేవిపేట పంచాయతీ బాడిశవారిగుంపునకు చెందిన పొడియం కన్నయ్య తన కుమార్తెను భద్రాచలం హాస్టల్లో వదిలి తిరిగి బైక్‌పై తన గ్రామం వస్తున్నారు. ఈ క్రమంలో చోడవరం సమీపంలో తన వాహనాన్ని అకస్మాత్తుగా కుడి వైపునకు తిప్పటంతో ఎదురుగా వస్తున్న వీరభద్రు వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరభద్రుకు, అతడి ఇద్దరు కుమారులకు కుడి కాళ్లు విరగడంతోపాటు తలకు బలమైన గాయాలయ్యాయి. శారదకు బలమైన గాయం కాగా, కన్నయ్య కాలు విరిగి తలకు గాయమైంది. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
రెండు బైక్‌ల ఢీ


