కల్వర్టులోనికి దూసుకెళ్లిన కారు
ఇద్దరికి తీవ్ర గాయాలు
అడ్డతీగల: అడ్డతీగల మండలం గౌరయ్యపేట 516ఇ జాతీయ రహదారి టోల్‌గేట్ వద్ద బుధవారం కారు అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకువెళ్లింది. ఈ ప్రమాదంలో కొయ్యూరు మండలం నడింపాలేనికి చెందిన పందల శివకు చేయి విరిగిపోగా పాలపర్తి సత్యనారాయణ అనే వ్యక్తికి నడుం వద్ద తీవ్రగాయమైంది. అడ్డతీగల నుంచి వారి స్వగ్రామం నడింపాలేనికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుం ది. ఈ ఘటనను గమనించిన స్థానికులు క్షతగాత్రులను బయటకు తీసి ప్రైవేటు వాహనంలో అడ్డతీగల సీహెచ్‌సీకి చికిత్స కోసం తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యానికి వైద్యులు వారిని రాజమహేమద్రవరం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
కల్వర్టులోనికి దూసుకెళ్లిన కారు
కల్వర్టులోనికి దూసుకెళ్లిన కారు


