నాణేల సేకరణలో మరో రికార్డ్
అమలాపురం టౌన్: అమలాపురానికి చెందిన నాణేల సేకరణకర్త పుత్సా కృష్ణ కామేశ్వర్ మరో రికార్డ్‌ను సొంతం చేసుకుని వరుసగా ఐదో సారి లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించారు. వివిధ సందర్భాల్లో విడుదలైన రూ.75 నాణేల సేకరణకు ఆయన పేరు ఆ పుస్తకంలో మరోసారి రికార్డయ్యింది. గత నాలుగేళ్లలో ఈ రికార్డులను అందుకోవడం వరుసగా ఇది ఐదో సారి. తపాలా బిళ్లల సేకరణలో రెండు సార్లు, నాణేల సేకరణలో ఒకసారి, కరెన్సీ నోట్ల సేకరణలో మరోసారి, తాజాగా నాణేల సేకరణలో ఐదోసారి రికార్డులకెక్కారు. భావి తరాలకు మన దేశ చరిత్రను, సంస్కృతిని ఈ నాణేలు, తపాలా బిళ్లలు, కరెన్సీ నోట్ల ద్వారా తెలియజేయడమే తన లక్ష్యమని కృష్ణ కామేశ్వర్ తెలిపారు.


