ఉమ్మడి జిల్లా బాస్కెట్ బాల్ జట్ల ఎంపిక
రామచంద్రపురం: ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా త్రీ అండ్ త్రీ సీనియర్ బాస్కెట్‌బాల్ జట్ల ఎంపికల చాంపియన్‌షిప్ పోటీలను మంగళవారం కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. ఈ పోటీల్లో పురుషుల, మహిళల విభాగాల్లో రామచంద్రపురం జట్లు ఎంపికైనట్లు బాస్కెట్ బాల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్నమని చక్రవర్తి వెల్లడించారు. కాగా.. ఈ నెల 22, 23 తేదీల్లో కృత్తివెంటి పేర్రాజు పంతులు క్రీడా ప్రాంగణంలో జరిగే రాష్ట్ర స్థాయి ఆంధ్రప్రదేశ్ త్రీ అండ్ త్రీ సీనియర్ బాస్కెట్ బాల్ పోటీల్లో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా పురుషుల, మహిళల జట్లు పాల్గొంటాయని చక్రవర్తి తెలిపారు. రాష్ట్ర స్థాయిలో ఉత్తమ ప్రదర్శన కనబర్చిన జట్లను ఎంపిక చేసి, ఢిల్లీలో జరిగే జాతీయ పోటీలకు పంపిస్తామన్నారు. ఎంపికై న క్రీడాకారులకు మున్సిపల్ చైర్ పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల రిశ్వంత్‌రాయ్, డాక్టర్ కోట సతీష్, బాస్కెట్‌బాల్ అసోసియేషన్ సభ్యులు అభినందనలు తెలిపారు.


