ఆలయ పునర్నిర్మాణానికి భారీ విరాళాలు
పి.గన్నవరం: ఎల్.గన్నవరంలో కొలువుదీరిన మహాలక్ష్మి అమ్మ వారి ఆలయ పునర్నిర్మాణానికి సోమవారం పలువురు భక్తులు రూ.12.2 లక్షలు విరాళాలు అందించినట్టు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. గ్రామానికి చెందిన అడబాల వారి కుటుంబ సభ్యులు మొత్తం రూ.8,70,135, అన్నాబత్తుల వీరన్న కుటుంబ సభ్యులు రూ.2,12,121, చిట్టాల వెంకన్న రూ.51,116, మహాదశ భాస్కరరావు రూ.25,116, పలువురు రూ.10 వేల చొప్పున విరాళం అందించారు. విరాళం అందించిన భక్తులను ఆలయ కమిటీ సభ్యులు, గ్రామస్తులు అభినందించారు.


