జాతీయ పురస్కారానికి ఎంపిక
వీఆర్‌పురం: అంతర్జాతీయ సాహిత్య సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక మన్యం కవి నూనే రమేష్‌ను జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేసినట్లు తెలిపారు. పోలవరం జిల్లా వంటి ఏజెన్సీలో పుట్టి తెలుగు భాష సంస్కృతి, వైభవం, సాహిత్యం తెలుగు కళల పరిరక్షణ కోసం నిరంతరాయంగా సాహితీ సాంస్కృతిక సామాజికసేవలతో సాహితీ ప్రభంజనం సృష్టిస్తున్న మన్యం కవి నూనె రమేష్‌ను అంతర్జాతీయ సాహిత్య సేవా సంస్థ శ్రీశ్రీ కళావేదిక తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్యర్యంలో ప్రాచీన కవుల వారసులతో నిర్వహించే సాహితీ సాంస్కృతిక పట్టాభిషేక మహోత్సవ పురస్కారం ప్రదానం చేస్తారని తెలిపారు. రమేష్ చేస్తున్న అమూల్యమైన కృషికి గౌరవార్థం జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపిక చేశామని తెలియజేశారు. జనవరి 21న బుధవారం నాడు విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో ఈ పురస్కారన్ని అందిస్తారు. శ్రీశ్రీ కళావేదిక చైర్మన్ కత్తిమండ ప్రతాప్ తదితరులు తెలిపారు.


