లారీ ఢీకొని వ్యక్తి..
గండేపల్లి: లారీ ఢీకొన్న ఘటనలో రోడ్డు దాటుతున్న వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. ఎస్సై యూవీ శివ నాగబాబు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని మల్లేపల్లి నీలకుండీలతోటకు చెందిన శీలం శివరామకృష్ణ (60) మంగళవారం స్థానిక సంతమార్కెట్ వద్ద సైకిల్‌పై రోడ్డు దాటుతున్నాడు. అతడిని విశాఖపట్నం వైపు నుంచి విజయవాడ వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శివరామకృష్ణ అక్కడికక్కడే మృతి చెందాడు. అతడు స్థానికంగా ఉన్న ఓ హోటల్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు.
పిచ్చికుక్క దాడి
దేవరపల్లి: దేవరపల్లిలోని థియేటర్ సెంటర్‌లో మంగళవారం ఓ పిచ్చికుక్క పలువురిపై దాడి చేసి గాయపరిచింది. దీని దాడిలో కె.నాగేశ్వరరావు, పిట్లా విజయ, జ్యేష్ఠ చేతన్, ఆలేటి రవికుమార్, బంగారు మహేష్, పాసం నాగమణి తీవ్రంగా గాయపడ్డారు. వారికి స్థానిక ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స అందిస్తున్నారు. ఈ పీహెచ్‌సీ పరిధిలో డిసెంబర్‌లో 98 మంది కుక్క కాటుకు గురి కాగా, ఈ నెలలో ఇప్పటి వరకు 53 మంది కుక్కుకాటుకు గురయ్యారు.
లారీ ఢీకొని వ్యక్తి..


