అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు
పెరవలి: అన్నవరప్పాడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం భక్తులు పోటెత్తారు. స్వామి, అమ్మవార్లకు వివిద రకాల పూలతో విశేష అలంకరణ చేయటంతో స్వామివారిని చూసిన భక్తులు పులకించిపోయారు. స్వామివారికి తలనీలాలు సమర్పించారు. 12,500 మందికి ఉచిత అన్నసమారాధన నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి మీసాల రాధాకృష్ణ ఏర్పాట్లు పర్యవేక్షించారు.
శనైశ్చరునికి ప్రత్యేక పూజలు
కొత్తపేట: శనిదోష నివారణకు ప్రసిద్ధి చెందిన మందపల్లి ఉమామందేశ్వర (శనైశ్చర) స్వామివారిని శనివారం అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయం కిక్కిరిసింది. దేవస్థానం ఈఓ దారపురెడ్డి సురేష్‌బాబు ఆధ్వర్యంలో భక్తుల పూజలకు ఏర్పాట్లు చేశారు. ముందుగా ఆలయ అర్చకులు, వేదపండితులు స్వామివారికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు చేశారు. అనంతరం భక్తుల దర్శనానికి అనుమతించారు. భక్తుల ప్రత్యక్ష పూజలు, తైలాభిషేకాల టిక్కెట్ల ద్వారా దేవస్థానానికి రూ.1,60,160, పరోక్ష పూజలు, మనియార్డర్ల ద్వారా రూ.1,79,800, అన్నప్రసా దం విరాళాలు రూపంలో రూ.51,207 ఆదాయం వచ్చినట్టు ఈఓ సురేష్‌బాబు తెలిపారు.
అన్నవరప్పాడుకు పోటెత్తిన భక్తులు


