
తల్లిదండ్రుల చెంతకు బాలుడు
అల్లవరం: బోడసకుర్రు బ్రిడ్జి వద్ద్ద దారి తెలియకుండా ఇబ్బంది పడుతున్న పదేళ్ల బాలుడు మల్లిపూడి చిరును వారి తల్లిదండ్రులకు ఆదివారం సాయంత్రం అప్పగించామని ఎస్సై సంపత్‌కుమార్ తెలిపారు. ముమ్మిడివరం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం పక్కన నివాసం ఉంటున్న మల్లిపూడి ఏసులక్ష్మి పాలకొల్లు వెళ్లింది. తల్లి పాలకొల్లు వెళ్లిన తర్వాత చిరు, తల్లి వద్దకు పాలుకొల్లు వెళ్లాలని బయలుదేరి కొమానపల్లి నుంచి బోడసకుర్రు వరకూ తన సైకిల్‌పై వచ్చాడు. బోడసకుర్రు బ్రిడ్జి వరకూ వచ్చే సరికి దారి తెలియక ఇబ్బంది పడుతున్న బాలుడిని స్థానికులు గుర్తించి తల్లిదండ్రుల వివరాలను సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు. దీంతో అల్లవరం పోలీసులు స్పందించి ఆ బాలుడిని పోలీస్ స్టేషన్‌కు తీసుకువచ్చారు. బాలుడి నుంచి మరింత సమాచారం సేకరించిన పోలీసులు ముమ్మిడివరంలోని చిరు తల్లిదండ్రులు ఏసులక్ష్మి, సతీష్‌లకు సమాచారం అందించామని ఎస్సై సంపత్‌కుమార్ తెలిపారు. తల్లిదండ్రులు పోలీస్ స్టేషన్‌కు వచ్చిన తర్వాత చిరుని అప్పగించామని అన్నారు.