
బ్యాడ్మింటన్ పోటీల్లో క్రీడాకారుల ప్రతిభ
అమలాపురం రూరల్: కాకినాడలో జరిగిన ఏలూరు, పశ్చిమ గోదావరి, కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి జిల్లాల అండర్– 19 అమరావతి చాంపియన్ షిప్ బ్యాడ్మింటన్ పోటీల్లో కోనసీమ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచారు. ఈ పోటీల్లో జిల్లా నుంచి బ్యాడ్మింటన్ బాలుర సింగిల్స్ విభాగంలో విన్నర్‌గా మలికిపురానికి చెందిన నందకిశోర్, రన్నర్‌గా కృష్ణకార్తీక్, డబుల్స్ బాలుర విభాగంలో విన్నర్‌గా అమలాపురానికి చెందిన బి.ఆదిత్యరామ్, రన్నర్‌గా మలికిపురానికి చెందిన వై.గౌతమ్‌కుమార్, బాలికల డబుల్స్ విభాగంలో రన్నర్‌గా ఎం.రమ్య, రిత్విక నిలిచారు. డబుల్స్ విభాగంలో విజేతలు ఆదిత్యరామ్, గౌతమ్‌కుమార్‌లు తిరుపతిలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. విజేతలను కాకినాడ డీఎస్‌ఓ శ్రీనివాస్, జాతీయ అంపైర్ పాయసం శ్రీనివాసరావు, వ్యాయామ ఉపాధ్యాయ సంఘం సెక్రటరీ బీవీవీఎస్‌ఎన్ మూర్తి ఆదివారం అభినందించారు.