బోట్‌క్లబ్ (కాకినాడ సిటీ): జిల్లాలో బుధవారం కురిసిన వర్షాలకు పల్లపు ప్రాంతాలు నీట మునిగాయి. కాకినాడలో మెయిన్‌రోడ్డు, టూటౌన్ నూకాలమ్మ గుడి వీధి, సినిమారోడ్డు, ఎల్‌బీనగర్, కొత్తపేట మార్కెట్ వంటి పలు ప్రాంతాలు పూర్తిగా నీటమునిగాయి. జిల్లాలో పలు మండలాల్లో వరి పంట నీట మునిగింది. సామర్లకోట, కాకినాడ రూరల్, కరప, కొత్తపల్లి, పిఠాపురం మండలాల్లో అధికంగా వర్షాలు కురవడంతో నాట్లు పూర్తిగా మునిగిపోయాయి.
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూమ్
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రానున్న మూడు రోజులుగా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. శిథిల భవనాలకు ప్రజలు దూరంగా ఉండాలని ఆయన తెలిపారు. జిల్లాలో వర్షాల వల్ల ఎటువంటి ఇబ్బంది ఏర్పడినా టోల్ ఫ్రీ నెంబర్, కంట్రోల్ రూమ్‌లో ఉన్న 0884 2356801 నంబర్‌కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ఆర్డీఓ, తహసీల్దార్ కార్యాలయాల్లోనూ కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు.
పలుచోట్ల నీట మునిగిన పంటలు
కలెక్టరేట్‌లో కంట్రోల్ రూం ఏర్పాటు