
వాడపల్లి ఆలయానికి బ్యాటరీ కార్లు
కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వర స్వామివారి ఆలయానికి ఓ కన్‌స్ట్రక్షన్ కంపెనీ రెండు బ్యాటరీ కార్లు అందజేసింది. కోనసీమ తిరుమలగా ప్రసిద్ధి చెందిన వాడపల్లి క్షేత్రానికి వేలాదిగా భక్తులు తరలివస్తున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా వృద్ధులు, దివ్యాంగుల సౌకర్యార్థం మెర్లపాలెం గ్రామానికి చెందిన జేఎస్‌ఎన్ రాజు కన్‌స్ట్రక్షన్ కంపెనీ వారు రూ.12 లక్షలు విలువైన రెండు కార్లను అందజేసినట్టు దేవదాయ, ధర్మాదాయ శాఖ డీసీ, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు తెలిపారు. ఈ కార్లను ఈ నెల 15న ఎమ్మెల్యే బండారు సత్యానందరావు ప్రారంభిస్తారని చెప్పారు.