
రూ.1.50 లక్షలవెండి కిరీటం సమర్పణ
అంబాజీపేట: గంగలకుర్రు అగ్రహారంలో ఉన్న పార్వతీ వీరేశ్వర స్వామివారికి దాతలు వెండి కిరీటం, ఆభరణాలను సోమవారం సమర్పించారు. గంగలకుర్రుకు చెందిన తనికెళ్ల సోమసూర్య సుబ్రహ్మణ్య విశ్వేశ్వరరావు కుమారులు వెంకటసత్య సూర్యనాగభూషణం, లక్ష్మీసూర్యపద్మ దంపతులు, తనికెళ్ల రామలక్ష్మి నరసింహమూర్తి, పద్మావతి దంపతులు, మనవలు దుర్గావిశ్వనాథం, మనవరాలు ఉమాభాను రూ.1.50 లక్షలతో తయారు చేయించిన వెండి కిరీటం, ఆభరణాలను పార్వతీ వీరేశ్వరస్వామి వారికి సమర్పించారు. అంతకుముందు వెండి వస్తువులను ఆలయ ప్రధానార్చకులు చంద్రమౌ ళీ సూర్యకామేష్ ప్రత్యేక పూజలు, సంప్రోక్షణ నిర్వహించి, స్వామివార్లకు అలంకరించారు.