
ఉత్కంఠగా అండర్–17 చెస్ పోటీలు
అమలాపురం టౌన్: జిల్లా స్థాయి అండర్ –17 చెస్ పోటీలు జిల్లా చెస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక విద్యానిధి విద్యా సంస్థల్లో ఆదివారం ఉత్కంఠ భరితంగా జరిగాయి. జిల్లా వ్యాప్తంగా ఈ పోటీలకు దాదాపు 60 మంది క్రీడాకారులు వచ్చి తమ ప్రతిభకు పదను పెట్టారు. పోటీల్లో బాలురు నుంచి ముగ్గురిని, బాలికల నుంచి ముగ్గురిని రాష్ట్ర పోటీలకు ఎంపిక చేసినట్లు రాష్ట్ర చెస్ అసోసియేషన్ కార్యదర్శి కవురు జగదీష్ చెప్పారు. బాలుర విభాగంంలో గిరిమణి శేఖర్ (ప్రథమ), బండారు నానిబాబు (ద్వితీయ), తాడి సాయి వెంకటేష్ (తృతీయ), బాలికల విభాగంలో పనిశెట్ట ధరణి (ప్రథమ), బొడ్డు సాన్వి (ద్వితీయ), పసుపులేటి రేష్మ (తృతీయ) గెలిచారని తెలిపారు. వీరు ఈ నెల 16,17 తేదీల్లో కాకినాడ జేఎన్‌టీయూలో నిర్వహించే రాష్ట్ర స్థాయి చెస్ పోటీల్లో జిల్లా తరఫున ఆడతారని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి తాడి వెంకట సురేష్ తెలిపారు. విజేతలకు విద్యానిది విద్యా సంస్థల చైర్మన్ ఆకుల బాపన్నాయుడు షీల్డ్‌లు అందజేశారు.