
సెమీస్ దశలో సీబీఎస్‌సీ బ్యాడ్మింటన్ పోటీలు
నాగమల్లితోట జంక్షన్ (కాకినాడ సిటీ): కాకినాడ సురేష్‌నగర్‌లో శ్రీప్రకాష్ స్కూల్‌లో జరుగుతున్న రాష్ట్రస్థాయి సీబీఎస్‌సీ క్లస్టర్ బ్యాడ్మింటన్ పోటీలు రెండో రోజు ఆదివారం క్వార్టర్స్ దశ పూర్తి చేసుకుని సెమీస్ దశకు చేరుకున్నాయి. అండర్–14, 17, 19 విభాగాల్లో క్రీడాకారులు ప్రత్యర్ధులతో తలపడ్డారు. జిల్లా బ్యాడ్మింటన్ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలకు పరిశీలకునిగా గణేష్, జాతీయస్థాయి రిఫరీలుగా శ్రీనివాస్, భద్రంల పర్యవేక్షణలో పోటీలు జరుగుతున్నాయి. ప్రిన్సిపాల్ శ్రీదేవి, డైరెక్టర్ విజయ్ ప్రకాష్ ఆదివారం మ్యాచ్‌లను ప్రారంభించారు.
సెమీస్‌కు చేరిన జట్ల వివరాలు
అండర్–14 బాలుర విభాగంలో..
సిల్వర్ హోక్స్ స్కూల్ (హైదరాబాద్), ఇండస్ యూనివర్సల్ స్కూల్ (హైదరాబాద్), సీఆర్‌రెడ్డి పబ్లిక్ స్కూల్(ఏలూరు), మౌంట్‌లిటిరా జి.స్కూల్ (మణికొండ)
అండర్–17 బాలుర విభాగంలో ..
గాడియమ్ స్కూల్ (హైదరాబాద్), పల్లవి మోడల్ స్కూల్ (సికింద్రాబాద్), ఎస్టిజోసెఫ్ ఇంగ్లిష్ స్కూల్(కర్నూల్), డీపీఎస్ (ఆనందపురం, వైజాగ్)
అండర్–19 బాలుర విభాగంలో..
నీలకంత విద్య పీట్ (తెలంగాణ), సిల్వర్ హోక్స్ స్కూల్ (హైదరాబాద్), వికాస్ ద కాన్సెప్ట్ స్కూల్(హైదరాబాద్), హ్యాపీ వాలీ స్కూల్ (విజయవాడ)