
శ్యామ్‌తో నిరుద్యోగుల కల సాకారం
బోట్‌క్లబ్ (కాకినాడసిటీ): నిరుద్యోగుల కలలను శ్యామ్ ఇనిస్టిట్యూట్ నిజం చేస్తోందని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. ఇటీవల విడుదలైన ఏపీ పోలీస్ కానిస్టేబుల్ ఫలితాల్లో అత్యుత్తమ ఫలితాలు సాధించిన శ్యామ్ ఇనిస్టిట్యూట్ అధినేత గుంటూరు శ్యామ్‌ను, డైరెక్టర్ శైలజను, రాష్ట్ర స్థాయి టాపర్స్ నానాజీ, రమ్యమాధిరి, ఎం.అచ్యుతరావు, ఎస్ భవానీలను విశాఖపట్నంలో ఆమె నివాసంలో శనివారం సత్కరించారు. పేద, మధ్య తరగతి విద్యార్థులకు నాణ్యమైన శిక్షణ ఇస్తూ ప్రభుత్వ ఉద్యోగులుగా తీర్చిదిద్దడంలో శ్యామ్ ఇనిస్టిట్యూట్ కీలక పాత్ర పోషిస్తోందని హోం మంత్రి అన్నారు. ప్రభుత్వం ప్రకటించిన 6014 పోస్టుల్లో 4673 పైగా పోస్టులు శ్యామ్ ఇనిస్టిట్యూట్ విద్యార్థులే కై వసం చేసుకోవడం, రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంకుతో పాటు అన్ని జిల్లాలోను జిల్లా స్థాయి మొదటి ర్యాంకులు సాధించడం గొప్ప విషయమన్నారు.