
మానవ విధ్వంసం వల్లే ..
వర్షాలను ఆకర్షించే ఎన్నో వనరులు ఆక్వా చెరువుల వల్ల ప్రభావితమవుతున్నాయి. నైరుతి నుంచి వాయవ్యంగా రావాల్సిన మేఘాలు ఇటీవల కాలంలో ఆగ్నేయంగా పయనిస్తున్నాయి. దీనివల్ల ఒక ప్రాంతంలో భారీ వర్షం కురవడం, ఆ పక్కనే ఉన్న ప్రాంతంలో వర్షం కురకపోవడం జరుగుతోంది. రోహిణీ కార్తెలో వర్షాలు పడటం వల్ల ఉష్ణోగ్రతలు తగ్గాయి. దీనివల్ల భారీ వర్షాలు కురిసే మేఘాలు ఏర్పడటం లేదు. ఈ కారణంగా వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. వర్షాలు కురవాలంటే సముద్ర ఉష్ణోగ్రతల్లో సమతుల్యత ఉండాలి. మానవ విధ్వంసం వల్ల ఉష్ణోగ్రతలు అంతకంతకూ పెరుగుతున్నాయి. దీనివల్ల కూడా రుతుపవనాలకు అనుకూల వాతావరణం ఏర్పడటం లేదు.
– డాక్టర్ పి.కృష్ణకిశోర్, కోనసీమ సాగర, పర్యావరణ పరిశోధకుడు, అమలాపురం