
మారేడుబాకలో గంజాయి కలకలం
కపిలేశ్వరపురం (మండపేట): మారేడుబాకలో గంజాయి వ్యవహారం కలకలం రేపింది. మండపేట పట్టణాన్ని ఆనుకుని ఉన్న మారేడుబాకలోని ఖాళీ స్థలంలో యువకులు గంజాయి తాగుతున్నారన్నారంటూ గురువారం పట్టణ పోలీసులకు సమాచారం అందింది. ఎస్సై ఎన్.రాము తన సిబ్బందితో కలసి దాడి చేశారు.
మారేడుబాక గ్రామానికి చెందిన ఇద్దరు యువకులను, అనపర్తి మండలానికి చెందిన ఒక యువకుడిని, మండపేటకు చెందిన 17 ఏళ్ల బాలికను అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి సుమారు 300 గ్రాముల గంజాయిని స్వాధీనపర్చుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరుపరిచగా రిమాండ్ విధించినట్టు ఎస్సై రాము శుక్రవారం తెలిపారు. బాలికను రాజమహేంద్రవరం డీపీఓ జువైనల్ హోమ్‌లో హాజరు పరిచామన్నారు.