వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోన్‌–2 అధ్యక్షుడిగా కారుమూరి | - | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోన్‌–2 అధ్యక్షుడిగా కారుమూరి

Aug 7 2025 7:24 AM | Updated on Aug 7 2025 7:34 AM

వైఎస్

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోన్‌–2 అధ్యక్షుడిగా కారుమ

ఏలూరు (ఆర్‌ఆర్‌పేట): వైఎస్సార్‌ సీపీ రాష్ట్ర యువజన విభాగం జోన్‌–2 వర్కింగ్‌ ప్రెసిడెంట్‌గా ఏలూరు పార్లమెంట్‌ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్‌కుమార్‌ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ఆయనను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. ఈ మేరకు జోన్‌ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్‌ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.

పెన్షనర్స్‌ విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పెద్దిరాజు

గోకవరం: వైఎస్సార్‌ సీపీ ఎంప్లాయీస్‌, పెన్షనర్స్‌ విభాగ రాష్ట్ర కార్యదర్శిగా గోకవరం మండలం గుమ్మళ్లదొడ్డికి చెందిన కండెల్ల పెద్దిరాజును నియమిస్తూ వైఎస్సార్‌ సీపీ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. పార్టీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా కొనసాగుతున్న పెద్దిరాజు గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వంలో పార్టీ రాష్ట్ర మాదిగ కార్పొరేషన్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వహించారు. తనకు ఈ పదవి అప్పగించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి, మాజీ మంత్రి, పార్టీ జగ్గంపేట ఇన్‌చార్జి తోట నరసింహంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

ఫేక్‌ పీఎఫ్‌ చలానాలపై విచారణ

అన్నవరం: సత్యదేవుని దేవస్థానంలో శానిటరీ కాంట్రాక్టర్‌ కనకదుర్గా మేన్‌పవర్‌ సర్వీసెస్‌ తప్పుడు పీఎఫ్‌ చలానాలు ఇచ్చినట్టు వచ్చిన ఆరోపణలపై రాజమహేంద్రవరం ఆర్‌జేసీ వి.త్రినాథరావు బుధవారం విచారణ చేపట్టారు. ఈఓ కార్యాలయంలో జరిగిన ఈ విచారణలో ఈఓ వీర్ల సుబ్బారావు మాట్లాడుతూ కాంట్రాక్టర్‌ మూడు నెలలకు ఫేక్‌ పీఎఫ్‌ చలానాలు ఇచ్చినట్టు గుర్తించామని తెలిపారు. దాంతో కాంట్రాక్టర్‌ను హెచ్చరించడంతో మళ్లీ మూడు నెలలకు రూ.30 లక్షలు పీఎఫ్‌ చెల్లించి ఒరిజినల్‌ చలానాలు జత చేశారని తెలిపారు. కాగా, కాంట్రాక్టర్‌ తరఫున హాజరైన ప్రతినిధి మాట్లాడుతూ తాము వెనుక ఇచ్చిన చలానాలే అసలైనవని, ముందు చలానాలు తాము ఇచ్చినవి కాదని చెప్పినట్టు ఆర్‌జేసీ తెలిపారు. తప్పుడు చలానాలు ఎలా వచ్చాయో చెప్పడానికి తమకు కొంత సమయం కావాలని కోరారని దాంతో విచారణ వాయిదా వేశామని ఆర్‌జేసీ తెలిపారు. అయితే ముందు ఇచ్చిన ఫేక్‌ చలానాల ఆధారంగా దేవస్థానం బిల్లు చెల్లించిందని, అది కాంట్రాక్టర్‌ అకౌంట్‌లోనే జమ అయిందని ఆయన తెలిపారు. ఫేక్‌ చలానాలు సమర్పించిన కాంట్రాక్టర్‌ తరఫు వ్యక్తి విష్ణు స్టేట్‌మెంట్‌ కూడా రికార్డు చేస్తామని ఆర్‌జేసీ వివరించారు. వారం రోజుల్లో మళ్లీ విచారణ నిర్వహిస్తామని తెలిపారు. దేవస్థానం ఏఈఓ ఎల్‌.శ్రీనివాస్‌, శానిటరీ సూపరింటెండెంట్‌ తాడి గుర్రాజు విచారణలో పాల్గొన్నారు.

ప్రయాణికులకు

Ððl$Æý‡$-OVðS¯]l ÝûMýSÆ>ÅË$ ˘

రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ

తుని: ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తున్నట్టు దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్‌కుమార్‌ శ్రీవాత్సవ అన్నారు. అమృత్‌భారత్‌ రైల్వేస్టేషన్‌గా ఎంపికై న స్థానిక రైల్వే స్టేషన్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను విజయవాడ డివిజన్‌ అధికారి మోహిత్‌ సొనాకియాతో కలిసి ఆయన గురువారం తనిఖీ చేశారు. ప్రయాణికులు, సిబ్బందితో మాట్లాడి కల్పించాల్సిన సౌకర్యాలు, ఎదుర్కొంటున్న ఇబ్బందులు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జెడ్‌ఆర్‌యూసీసీ మెంబర్‌ బొడపాటి శ్రీను పలు సమస్యలను జీఎం దృష్టికి తీసుకెళ్లారు. రైల్వే యూనియన్‌ ప్రతినిధులు తమ సమస్యలను పరిష్కరించాలని వినతిపత్రం అందజేశారు.

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోన్‌–2 అధ్యక్షుడిగా కారుమ1
1/3

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోన్‌–2 అధ్యక్షుడిగా కారుమ

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోన్‌–2 అధ్యక్షుడిగా కారుమ2
2/3

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోన్‌–2 అధ్యక్షుడిగా కారుమ

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోన్‌–2 అధ్యక్షుడిగా కారుమ3
3/3

వైఎస్సార్‌ సీపీ యువజన విభాగం జోన్‌–2 అధ్యక్షుడిగా కారుమ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement