
నెలకి రూ.4 వేల ఆర్థిక సాయం
ఫోస్టర్ కేర్‌లో చిన్నపిల్లల్ని దత్తత తీసుకుంటే ఆ బాలల సంరక్షణ కోసం ఒకొక్కరికి నెలకి రూ.4 వేలు చొప్పున రెండేళ్ల పాటు ఆర్థిక సాయం అందిస్తాం. ఈ మొత్తం బాలల విద్య, ఆరోగ్యపరమైన అవసరాల కోసం వెచ్చించాల్సి ఉంటోంది. సోదర, సోదరి బంధాలతో ముడిపడి ఉన్న అనాథ లేదా అర్ధ అనాథ బాలలను విడదీయం. వారిని ఒకే గ్రహీతకి దత్తత ఇస్తాం. దత్తత ఇచ్చిన పిల్లల్ని కంటికి రెప్పలా కాచుకుంటాం. వారి సంరక్షణను నిరంతరం పర్యవేక్షిస్తాం. అందుకు మా డీసీపీయూ బృందం నిరంతరాయంగా పనిచేస్తుంది. దత్తత కావాలనుకునే వారు మరిన్ని వివరాల కోసం జిల్లా బాలల పరిరక్షణాధికారి, సీహెచ్ వెంకట్రావును 85550 60818 లేదా జిల్లా బాలల సంరక్షణాధికారి కె.విజయను 63035 99264 నంబర్లలో సంప్రదించాలి.
– చెరుకూరి లక్ష్మి, పీడీ, ఐసీడీఎస్, కాకినాడ జిల్లా
ఏ బిడ్డా అనాఽథగా పెరగకూడదనే..
సమాజంలో ఏ బిడ్డ అనాథగా పెరగకూడదనే సత్సంకల్పంతో ఫోస్టర్ కేర్‌ను ప్రోత్సహిస్తున్నాం. గతం కంటే మరింత విస్తృత ప్రచారం చేసి ఈ తాత్కాలిక సంరక్షణను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నాం. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ఇప్పటికే అందుకు ప్రత్యేక కార్యాచరణ సిద్ధమైంది. ఆ దిశగా పీడీ బృందం పయనిస్తోంది. అనాథల భవితకు అండగా నిలిచే సహృదయాలను తట్టిలేపడమే ఈ కార్యక్రమ లక్ష్యం. బిడ్డలు లేని దంపతులు, తల్లిదండ్రుల ప్రేమ నోచుకోకపోతున్న అమాయక చిన్నారులకు ఈ కార్యక్రమం ఓ వరం. శిశు సంరక్షణ కేంద్రాలు అనాథ బిడ్డలకు ఆఖరి మజిలీ కావాలి తప్ప, అవే శాశ్వతం కాకూడదనే సంకల్పంతో ఫోస్టర్ కేర్‌ను విజయవంతం చేయాలని నిర్ణయించాం.
– షణ్మోహన్ సగిలి, కలెక్టర్, కాకినాడ జిల్లా

నెలకి రూ.4 వేల ఆర్థిక సాయం