కరువును జయిద్దాం | - | Sakshi
Sakshi News home page

కరువును జయిద్దాం

Nov 3 2026 1:09 AM | Updated on Nov 3 2026 1:09 AM

‘ఈసారి వర్షాకాలంలో ఎల్‌నినో ప్రభావంతో జిల్లావ్యాప్తంగా తీవ్ర వర్షాభావం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఏర్పడిన కరువు పరిస్థితులను కలిసికట్టుగా జయిద్దాం.. ఇందుకోసం ప్రతి నీటి బొట్టును ఒడిసిపట్టి సంరక్షించుకుంటేనే భవిష్యత్‌లో ఎదురయ్యే మరిన్ని ఇబ్బందులను అధిగమించవచ్చు. ఇందుకోసం రబీ సీజన్‌లో రైతులు నీటి లభ్యత ఆధారంగా అవసరమైన ఆరుతడి పంటలు మాత్రమే సాగుచేయాలి. అలాగే నీరు, విద్యుత్‌ వినియోగంలోనూ పొదుపు చర్యలు పాటించాలి. ఇది నిత్యావసరాల వినియోగంలోనూ చూపించాలి. ఇక బియ్యం, నిత్యావసరాల కృత్రిమ కొరత సృష్టించి అక్రమాలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం..’ అని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అభిప్రాయపడ్డారు. సోమవారం ఆయన ‘సాక్షి’తో ముఖాముఖిగా మాట్లాడిన వివరాలు ఇలా.. – గద్వాల

జిల్లాలోని జూరాల ప్రాజెక్టు కుడి కాల్వ, నెట్టెంపాడు ప్రాజెక్టుల కింద 1,83,573 ఎకరాల్లో పంటలు సాగుచేశారు. జూరాల కింద సాగైన పంటలకు నవంబర్‌ 6వ తేదీ వరకు వారబంధీ విధానంలో సాగునీరు అందిస్తాం. అలాగే నెట్టెంపాడు కింద వారాబంధీ విధానంలో నీటి లభ్యతను బట్టి పంటలకు నీటిని అందిస్తాం. ఈసారి వర్షాలు కురవనందున ప్రాజెక్టులకు నీరు సమృద్ధిగా రాలేదు. ఫలితంగా నీటి ఎద్దడి నెలకొనడంతో పంటలకు సమృద్ధిగా విడుదల చేయలేకపోతున్నాం.

సాగునీటి ప్రాజెక్టులు..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement