తాగునీటికి 0.81 టీంఎసీలు.. | - | Sakshi
Sakshi News home page

తాగునీటికి 0.81 టీంఎసీలు..

Nov 3 2026 1:09 AM | Updated on Nov 3 2026 1:09 AM

జిల్లాలో ఒక నెలకు తాగునీటి అవసరాల కోసం 0.9 టీఎంసీల చొప్పున వచ్చే వానాకాలం వరకు 9 నెలల పాటు మొత్తం 0.81 టీంఎసీల నీరు అవసరమవుతుంది. తాగునీటి సమస్య తలెత్తకుండా ఇప్పటికే అవసరమైన బోర్లు, బావులను వినియోగించుకునేలా ప్రణాళిక సిద్ధం చేశాం. అలాగే ఎక్కడైనా రిపేర్లు ఉంటే వెంటనే మరమ్మతు చేయాలని ఆదేశించాం. ఇందులో భాగంగానే ఈ నెల 15 నుంచి డిసెంబర్‌ 31 వరకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనున్నాం. ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేసేలా ముందస్తు ప్రణాళిక రూపొందించాం. ప్రస్తుతం జూరాలలో డెడ్‌ స్టోరేజీ కంటే పైన లైవ్‌లో నీటిని వినియోగించుకునేందుకు 3.20 టీఎంసీలు అందుబాటులో ఉంది. ఇక్కడి నుంచి ఉమ్మడి జిల్లావ్యాప్తంగా తాగునీటి అవసరాలకు సరఫరా చేస్తున్నారు. దీనిని దృష్టిలో ఉంచుకుని పంటలకు వారాబంధీ విధానంలో నీటిని విడుదల చేస్తున్నాం.

జల సంరక్షణ పనులు

ప్రభుత్వం వీబీజీ రాంజీ పథకంలో భాగంగా జలసిరి కింద పెద్దఎత్తున నీటికుంటలు, ఇంకుడు గుంతలు వంటి వాటికి అధిక ప్రాధాన్యత కల్పిస్తూ 375 రకాల పనులు కల్పించడం జరిగింది. ఇందులో భాగంగా జిల్లాలో జలసిరికి సంబంధించి మొత్తం 18 వేల జల సంరక్షణ పనులు మంజూరయ్యాయి.

పెండింగ్‌ పనుల పూర్తికి చర్యలు

రాబోయే మూడు నెలలో ప్రాజెక్టులకు సంబంధించి జిల్లాలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను పూర్తి చేసి అసంపూర్తి ప్రాజెక్టులు పూర్తయ్యేలా చర్యలు చేపడుతాం. గట్టు ఎత్తిపోతల కింద వెయ్యి ఎకరాలు, మల్లమ్మకుంట కింద 537 ఎకరాల భూ సేకరణ పూర్తిచేస్తాం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement