పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలి | - | Sakshi
Sakshi News home page

పంటలు ఎండిన రైతులను ఆదుకోవాలి

Oct 19 2026 12:43 AM | Updated on Oct 19 2026 12:43 AM

గట్టు: వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో పంటలు ఎండిపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని బీఆర్‌ఎస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి బల్గెర హనుమంతునాయుడు డిమాండ్‌ చేశారు. ఆదివారం గట్టు మండలం రాయాపురం శివారులో ఎండిన పంటలను పరిశీలించారు. ఇటీవల హరీశ్‌రావు ఎండిన వరిపొలాన్ని పరిశీలించగా.. బాధిత రైతుకు పార్టీ తరఫున రూ. 10వేల ఆర్థికసాయాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాభావ పరిస్థితులకు తోడు కరెంటు కోతలు కూడా పంటలు ఎండిపోవడానికి కారణమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. కేసీఆర్‌ హయాంలో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు అందించారని గుర్తు చేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కరెంటు కోతలతో రైతుల ఉసురు తీస్తుందని ఆరోపించారు. కార్యక్రమంలో తిమ్మప్ప, డేవిడ్‌, గోపాల్‌, వెంక టేష్‌, రామునాయుడు, వీరారెడ్డి, కృష్ణ, కర్రెప్ప, నర్సింహులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement