న్యూస్రీల్
వడివడిగా అడుగులు..
జోగుళాంబ గద్వాల
భూమి పోతే..
అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుపై రాయపురం రైతుల ఆందోళన
ట్యాంకర్లతో సాగునీరు
సోమవారం శ్రీ 19 శ్రీ అక్టోబర్ శ్రీ 2026
●
గద్వాల: గట్టు మండలం రాయపురంలో సర్వేనం.83లో సుమారు 600 ఎకరాల అసైన్డ్ భూమి ఉండగా.. ఆరు దశాబ్దాల క్రితం 110 ఎకరాలను నిరుపేద కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం పంపిణీ చేసింది. నాటి నుంచి నేటి వరకు ఆ భూములను సాగుచేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అయితే రెండు నెలల క్రితం జిల్లాలో అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు కోసం ప్రభుత్వం చర్యలు చేపట్టింది. జిల్లాలో వెనుకబడిన గట్టు మండలంలో ఏర్పాటుచేస్తే వ్యవసాయపరంగా రైతులకు మేలు చేకూరడమే కాకుండా.. ఈ ప్రాంతం అభివృద్ధిపరంగా ముందుకెళ్తుందనే తలంపుతో సర్వే ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ క్రమంలోనే గట్టు మండలం రాయాపురంలో గట్టు – గద్వాల ప్రధాన రహదారికి ఇరువైపులా సర్వేనం.83లో ప్రభుత్వ భూమి 600 ఎకరాలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.
రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు..
అగ్రికల్చర్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు అనుకూలమైన భూమిని గుర్తించిన అధికారులు రాయపురానికి వెళ్లి సర్వే ప్రక్రియ సన్నాహాలు చేశారు. అయితే అప్పటికే 60 ఏళ్లుగా పంటలు పండించుకుంటున్న రైతులు ఆందోళన చెందారు. దీనిపై స్థానికంగా రెవెన్యూ అధికారులను సంప్రదించగా.. ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాలు అని అస్పష్టమైన సమాధానం చెప్పారు. అంతేకాకుండా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు అవసరమైన భూమిని సేకరించనున్నట్లు, ఇందుకు సంబంధించి గ్రామ సభ నిర్వహించనున్నట్లు గత ఆగస్టులో ప్రకటించారు. గట్టు తహసీల్దార్ విజయ్కుమార్ ఆధ్వర్యంలో గ్రామసభ నిర్వహించగా.. బాధిత రైతులతో పాటు గ్రామస్తులందరూ కూడా రీసెర్చ్ సెంటర్ ఏర్పాటును వ్యతిరేకించారు.
మూడు తరాలుగా వ్యవసాయాన్నే నమ్ముకుని జీవనాధారం
తమ భూములు ఇవ్వమంటూ
అధికారులకు విన్నపాలు
ఇప్పటికే సర్వేనంబర్ 83లో
సర్వే ప్రక్రియ పూర్తి
గ్రామసభలో రైతులందరూ ముక్తకంఠంతో వ్యతిరేకించినప్పటికీ అధికారులు మాత్రం రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు వడివడిగా అడుగులు వేశారు. ఈ క్రమంలోనే గతనెలలో సెంటర్ ఏర్పాటుకు అవసరమైన 60 ఎకరాల భూమిని సర్వే చేశారు. గట్టు – గద్వాల ప్రధాన రహదారికి ఇరువైపులా భూమి అనుకూలంగా ఉందని ప్రాథమికంగా అంచనా వేసి, సర్వే నివేదికను ఉన్నతాధికారులకు పంపారు. అయితే అధికారులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ సర్వే ప్రక్రియ చేపడుతున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. తాము భూములు ఇవ్వమని మండల, డివిజన్, జిల్లా అధికారులకు వినతిపత్రాలు అందజేశారు.
మా తాత ముత్తాతల నుంచి 60 ఏళ్లుగా
వ్యవసాయ భూమినే నమ్ముకుని జీవనం సాగిస్తున్నాం.. ఇప్పుడు కొత్తగా అభివృద్ధి పేరిట మా భూములను లాక్కోవాలని
అధికారులు చూస్తున్నారు.. మా బతుకులను రోడ్డున పడేయాలని ప్రయత్నిస్తున్నారు.. మాకు భూమిని నమ్ముకుని జీవించడమే తెలుసు.. ఉన్న భూమిని లాగేసుకుంటే మేము బతికేది ఎట్లా..? ఇది గట్టు మండలం రాయపురం గ్రామానికి చెందిన రైతుల
ఆవేదన.


