భూమినే నమ్ముకున్నాం.. | - | Sakshi
Sakshi News home page

భూమినే నమ్ముకున్నాం..

Oct 19 2026 12:43 AM | Updated on Oct 19 2026 12:43 AM

భూమినే నమ్ముకున్నాం.. రోడ్డున పడతాం.. నాలుగు కుటుంబాలకు ఆధారం.. న్యాయం చేస్తాం..

మా తాతల కాలంలో ప్రభుత్వం మాకు 3 ఎకరాల భూమిని ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మూడు తరాలుగా ప్రభుత్వం ఇచ్చిన భూమినే నమ్ముకుని జీవిస్తున్నాం. ఇప్పుడు ఉన్న భూమిని లాగేసుకుంటే ఎలా బతకాలి.

– నర్వ కర్రెప్ప రైతు, రాయపురం

మా కుటుంబానికి 60 ఏళ్ల క్రితం ప్రభుత్వం 2 ఎకరాల భూమిని ఇస్తే, అందులో బోరువేసుకుని వ్యవసాయం చేసుకుంటూ బతుకీడుస్తున్నాం. ఇప్పుడు మాకిచ్చిన భూమిలో ఏదో సెంటర్‌ ఏర్పాటు చేస్తామని అధికారులు చెబుతున్నారు. ఉన్న భూమిని తీసుకుంటే మా కుటుంబం మొత్తం రోడ్డున పడుతుంది.

– సాలే కర్రెప్ప, రైతు, రాయపురం

మా తాత దండు భీమయ్యకు 60 ఏళ్ల క్రితం సర్వేనం.83లో 4.20 ఎకరాలు ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు మానాన్న నాగన్నతో కలిసి వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఇటీవల మానాన్న మృతిచెందగా.. 4.20 ఎకరాలను నలుగురు అన్నదమ్ములం సమానంగా పంచుకుని జీవిస్తున్నాం. ఇప్పుడు ఉన్న భూమిని లాగేసుకుంటే మా నలుగురు అన్నదమ్ముల కుటుంబాలు ఒక్కసారిగా రోడ్డున పడుతాయి.

– దండు వీరేష్‌, రైతు, రాయపురం

గట్టు మండలం రాయపురంలో అగ్రికల్చర్‌ రీసెర్చ్‌ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ ప్రక్రియ చేపట్టాం. అయితే ఆ భూమిలో వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్న రైతులు భూమిని ఇవ్వడానికి సుముఖంగా లేరు. ఇదే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి రైతులకు న్యాయం చేస్తాం.

– మధుమోహన్‌, అదనపు కలెక్టర్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement