రైస్‌మిల్లుల్లో ఎఫ్‌సీఐ సోదాలు | - | Sakshi
Sakshi News home page

రైస్‌మిల్లుల్లో ఎఫ్‌సీఐ సోదాలు

Oct 18 2026 12:54 AM | Updated on Oct 18 2026 12:54 AM

గద్వాల క్రైం: జిల్లాలోని ఐదు రైస్‌మిల్లుల్లో శనివారం ఎఫ్‌సీఐ అధికారులు విస్తృతంగా సోదాలు చేపట్టి.. స్టాక్‌ రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా అధికారులు ప్రమోద్‌, రాఘవేంద్ర మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం ఆహార ధాన్యాల అక్రమ రవాణా, రీసైక్లింగ్‌ను కట్టడి చేసేందుకు సంచులపై క్యూఆర్‌ ట్యాగింగ్‌ విధానం అమల్లోకి తీసుకురావడం జరిగిందన్నారు. మిల్లు నిర్వాహకులు సకాలంలో బియ్యం పంపిణీ చేయకుండా నిల్వ ఉంచుకోవడం, ఎఫ్‌సీఐకు బియ్యం సరఫరాలో జాప్యం కలిగించడం వంటి చర్యలకు పాల్పడితే శాఖాపరమైన చర్యలు తప్పవన్నారు. పీడీఎస్‌ బియ్యం నాణ్యత లోపించడం, పాలిష్‌, రీసైక్లింగ్‌ చేస్తే వారిపై కఠినంగా వ్యవహరిస్తామన్నారు. మిల్లర్లు ఒక్కో బియ్యం బస్తాకు 45 కిలోల కంటే తక్కువ బియ్యం అందుతున్నట్లు ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మిల్లర్ల నిర్లక్ష్యం కారణంగా రేషన్‌ డీలర్లు నష్టపోతున్నారని అధికారులతో విన్నవించడంతో సోదాలు చేపట్టినట్లు పేర్కొన్నారు. రైతుల నుంచి ధాన్యాన్ని సేకరించి మిల్లర్లకు అందించేందుకు పౌర సరఫాల సంస్థ చర్యలు తీసుకుందన్నారు. మిల్లర్లు ఎఫ్‌సీఐకి బియ్యం పంపిణీ చేయడంలో నిర్లక్ష్యం వహిస్తే కార్పొరేషన్‌కు పెద్ద ఎత్తున నష్టం కలుగుతుందన్నారు. బియ్యం సరఫరా లక్ష్యాలను చేరుకోవడంలో విఫలమైతే జిల్లా అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం రికార్డులు, స్టాక్‌ బుక్‌లను పరిశీలించారు. ఈ సోదాల్లో సిబ్బంది స్వామికుమార్‌, ప్రశాంత్‌గౌడు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement