విద్యార్థుల్లో గణితం పట్ల ఉన్న భయాన్ని తొలగించి.. ఇష్టంగా నేర్చుకునేలా వివిధ రకాల టీచింగ్–లెర్నింగ్ మెటీరియల్‌తో బోధిస్తున్నారు గణిత ఉపాధ్యాయురాలు మాలె శోభారాణి. 14 ఏళ్లుగా ‘అప్రిసియేషన్ మ్యాథ్స్ టీచర్‌శ్రీగా సేవలందిస్తూ జాతీయస్థాయిలో పలు అవార్డులు, సర్టిఫికెట్లు అందుకున్నారు. ప్రస్తుతం పెద్దమునుగాల్‌చేడ్ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నారు. చదువుతో పాటు సామాజిక, నైతిక విలువలు, క్రమశిక్షణను విద్యార్థులకు నేర్పుతున్నారు. వెనుకబడిన విద్యార్థులను గుర్తించి అవసరమైన విద్యా సామగ్రిని అందిస్తూ అండగా నిలుస్తున్నారు. ఆమె సేవలను గుర్తించిన ప్రభుత్వం 2023లో రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుతో సత్కరించింది. ప్రధాని నరేంద్రమోదీ నుంచి ‘సేవాపక్వాడ్’ అవార్డును సైతం అందుకున్నారు. సైన్స్ ఫెయిర్లలో ప్రదర్శనలు ఇస్తూ విద్యార్థుల్లో శాసీ్త్రయ ఆలోచనను పెంపొందిస్తున్నారు.


