టీఎంయూఎన్‌ ప్రోగ్రాంలో జిల్లా విద్యార్థుల ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

టీఎంయూఎన్‌ ప్రోగ్రాంలో జిల్లా విద్యార్థుల ప్రతిభ

May 18 2026 12:18 AM | Updated on May 18 2026 12:18 AM

ధరూరు: హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని టీజీఐఆర్‌డీలో ఈ నెల 15 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించిన తెలంగాణ మోడల్‌ యునైటెడ్‌ నేషన్స్‌ (టీఎంయూఎన్‌) ప్రోగ్రాంలో జిల్లా నుంచి పాల్గొన్న విద్యార్థులు అత్యంత ప్రతిభకనబరిచారు. విద్యార్థులు రవిచంద్ర (పీఎంశ్రీ జెడ్పీహెచ్‌ఎస్‌, అయిజ), మిస్బా (జెడ్పీహెచ్‌ఎస్‌, ధరూరు), షర్మిల (జెడ్పీహెచ్‌ఎస్‌, మల్దకల్‌), రెహానా ఫర్విన్‌ (జెడ్పీహెచ్‌ఎస్‌, తక్కశిల), సంజీవ్‌ (టీసీఆర్‌ఎస్‌, బీచుపల్లి)లు యూఎన్‌ఓ కమిటీ ‘డీఐఎస్‌ఈకే’ అంశంపై ‘వ్యూహాత్మక సముద్ర మార్గాల సైనికీకరణ ద్వారా తలెత్తే ముప్పులను పరిష్కరించడం – ముఖ్యంగా హార్మూజ్‌ జలసంధిపై ప్రత్యేక దృష్టి సారించడం’.. ఇతర అంతర్జాతీయ అంశాలపై అనర్గళంగా మాట్లాడి రాష్ట్రస్థాయిలో 2, 3, 4వ స్థా నంలో నిలిచినట్లు జిల్లా రీసోర్స్‌పర్సన్‌ పి.విజయభాస్కర్‌రెడ్డి, గైడ్‌ టీచర్లు ముద్దమ్మ, శ్రీహరి, రాణి తెలిపారు. వీరికి సమగ్ర శిక్షణ అడిషనల్‌ ప్రాజెక్టు డైరెక్టర్‌ చేతుల మీదుగా అవార్డులు ప్రదానం చేసినట్లు పేర్కొన్నారు.

సమస్యల పరిష్కారానికి పోరాటం

అమరచింత: భవన నిర్మాణరంగ కార్మి కుల సమస్యల పరిష్కారానికి రాజీలే ని పోరాటం కొనసాగిస్తున్నామని తెలంగాణ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణరంగ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధానకార్యదర్శి సాంబశివుడు తెలిపారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్స్‌ భవనంలో జరిగిన సంఘం జిల్లా ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని భవన నిర్మాణరంగ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్మికులకు పింఛన్‌ సౌకర్యం, ప్రైవేట్‌ ఏజెన్సీల రద్దు, సహజ మరణానికి రూ.5 లక్షల పరిహారం పెంపునకు ప్రభుత్వాలతో పోరాడుతున్నామన్నారు. 60 ఏళ్లు పైబడిన కార్మికులకు నెలకు రూ.9 వేల పింఛన్‌ ఇవ్వాలని, సంక్షేమ పథకాల అమలుకు ఇచ్చిన ప్రైవేట్‌ ఏజెన్సీల పునరుద్ధరణను నిలిపి వేయా లని డిమాండ్‌ చేశారు. ఈఎస్‌ఐ అమలు చేయాలని, పెళ్లికానుక, ప్రసవాల నగదును రూ. లక్షకు పెంచాలన్నారు. పెండింగ్‌ క్లెయిమ్స్‌ పరిష్కరించాలని, నాలుగు లేబర్‌ కోడ్‌ లు రద్దు చేయాలని కోరారు. లేబర్‌ అడ్డాల్లో షెల్టర్లు, తాగునీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నా రు. ఈ నెల 25 న చేపట్టే చలో హైదరాబాద్‌కు భవ న నిర్మాణరంగ కార్మికులు అధి కసంఖ్యలో తరలివచ్చి జయప్రదం చేయాలని కోరారు. కార్యక్రమంలో సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు రంగన్న, జిల్లా ప్రధానకార్య దర్శి రాజు, టీయూసీఐ జిల్లా సహా య కార్యదర్శి గణేష్‌, మస్తామని, రమేష్‌, చెన్నయ్య, వెంకటేష్‌, శేఖర్‌, రవి, రాంచందర్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement