మల్దకల్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలుచేస్తున్న ఇందిరమ్మ ఇళ్ల పథకంతో పేదల సొంతింటి కల నెరవేరుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం మల్దకల్ మండలం అమరవాయిలో లబ్ధిదారులు నిర్మించుకున్న ఇళ్లను ఆయన ప్రారంభించి మాట్లాడా రు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. గద్వాల నియోజకవర్గంలో అర్హులందరికీ ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయడమే తన లక్ష్యమన్నారు. లబ్ధిదారులు సకాలంలో ఇంటి నిర్మాణం పూర్తిచేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్ కృష్ణారెడ్డి, నాయకులు తిమ్మారెడ్డి, పటేల్ ప్రభాకర్‌రెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, వీరన్న, పెద్ద గోపాల్‌రెడ్డి, తిమ్మారెడ్డి, రాజారెడ్డి, రంగన్న, మహేశ్, నాగన్న పాల్గొన్నారు.


