జాతీయ హోదా కల్పించాలి | - | Sakshi
Sakshi News home page

జాతీయ హోదా కల్పించాలి

May 18 2026 12:18 AM | Updated on May 18 2026 12:18 AM

అలంపూర్‌: పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్టు జాతీయ హో దా కల్పించడానికి తమ వంతుగా కృషి చేయాలని మలిదశ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు కోరారు. కర్నూలులోని క్యాంప్‌ కార్యాలయంలో ఆది వారం ఎమ్మెల్యే విజయుడిని మలిదశ తెలంగాణ ఉద్యమ జేఏసీ నాయకులు కలిశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా రైతాంగ ప్రయోజనాల కోసం పాలమూరు– రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనులు తక్షణమే పూర్తి చేసే విధంగా తమ వంతుగా కృషి చేయాలని వినతిపత్రం అందజేశారు. పాలమూరు జిల్లా రైతులకు నష్టం జరిగే విధంగా దిండి ప్రాజెక్టు పనులను తక్షణమే నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో జేఏసీ చైర్మన్‌ వలి, కన్వీనర్‌ వెంకట్రామయ్యశెట్టి, మున్సిపల్‌ చైర్మన్‌ జయరాముడు, మాజీ ఎంపీపీ సుదర్శన్‌గౌడ్‌, మాజీ ఆలయ కమిటీ చైర్మన్‌ నారాయణరెడ్డి, మున్సిపల్‌ కౌన్సిలర్‌ మోహన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement