గద్వాల: బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ప్రవేశాలను పారదర్శకంగా లక్కీడిప్ నిర్వహించినట్లు అదనపు కలెక్టర్ నర్సింగ్‌రావు తెలిపారు. శుక్రవారం గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి బెస్ట్ అవైలబుల్ స్కూల్స్‌లో ప్రవేశాల కోసం లక్కీడిప్ నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకుంటుందన్నారు. మూడో తరగతిలో 3 సీట్లు, 5వ తరగతిలో 2 సీట్లు, ఎనిమిదో తరగతిలో 1 సీటు కలిపి మొత్తం 6 సీట్ల భర్తీకి లక్కీడిప్ నిర్వహించినట్లు తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో పూర్తి పారదర్శకతతో డ్రా తీశామన్నారు. ఎంపికై న విద్యార్థులు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో రాజశేఖర్, పవన్‌కుమార్, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.


