విస్తృత తనిఖీలు | - | Sakshi
Sakshi News home page

విస్తృత తనిఖీలు

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

పకడ్బందీగా చెక్‌పోస్టులు

రైతుల నుంచి..

మూగజీవాల అక్రమ రవాణాకు చెక్‌

గద్వాలక్రైం:కబేళాలకు తరలుతున్న పశువుల (మూ గ జీవాల) అక్రమ రవాణాకు చెక్‌ పెట్టేలా పోలీసు లు ప్రత్యేక చర్యలు చేపట్టారు. రెండు రాష్ట్రాల సరిహద్దు ప్రాంతాల చెక్‌ పోస్టుల వద్ద ఇప్పటికే జిల్లా పోలీసు శాఖ హై అలర్ట్‌ ప్రకటించి అనుమతి లేకుండా తరలిస్తున్న పశువులను గుర్తించి, వాటిని గోశాలకు తరలించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. మూడు రోజుల క్రితం ఎస్పీ శ్రీనివాసరావు, డీఎస్పీ మొగిలయ్య, సిబ్బంది అలంపూర్‌ టోల్‌ప్లాజా వద్ద విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. జోగుళాంబ గద్వా ల జిల్లాలోని పూల్లూరు, బల్గెర, కేటీదొడ్డి అంతరాష్ట్రాల సరిహద్దులలో నిత్యం కంటైనర్లు, డీసీఎంలను నిలిపి సోదాలు చేస్తున్నారు. అక్రమార్కులు తమదైన వ్యూహాలతో పోలీసుల కళ్లు గప్పి గుట్టుగా రవాణా చేస్తున్నారనే సమాచారం మేరకు పోలీసులు వ్యూహాత్మంగా నిఘా పెంచారు. మరోవైపు డీ జీపీ సీవీ ఆనంద్‌ సైతం తాజాగా బుధవారం వీడి యో కాన్ఫరెన్స్‌ ద్వారా పలు మార్గదర్శకాలు చేశా రు. జిల్లాలో ఏర్పాటు చేసిన చెక్‌పోస్టుల వివరాలను సైతం డీజీపీ ఎస్పీని అడిగి తెలుసుకున్నారు.

తరలింపుపై నిఘా..

బక్రీద్‌ పండుగా సందర్భంగా పలువురు వ్యాపారులు కర్ణాటక, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి మూగజీవాలను ప్రైవేట్‌ వాహనాలలో గుట్టుగా తరలిస్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు నాలుగు రోజుల నుంచి సరిహద్దు ప్రాంతాల వద్ద నిఘా ముమ్మరం చేశారు. వ్యాపారులు మూగ జీవాలను సంతల్లో కొనుగోలు చేస్తుండడంతో పాటు రోడ్లపై సంచరిస్తున్న వాటిని సైతం దొంగతనంగా తరలించేందుకు సిద్ధమయ్యారు. అక్రమార్కులు వాహన సామర్థ్యానికి మించి మూగ జీవాలను అనుమతులు లేకుండా రవాణా చేస్తున్నారు.

పోలీసుశాఖ ఆధ్వర్యంలో బల్గెర, నందిన్నె, ఇర్కిచేడ్‌, సుంకేసుల డ్యాం, బైరాపురం, పుల్లూరు టోల్‌ప్లాజా, ఎర్రవల్లి ఎక్స్‌రోడ్డు వద్ద చెక్‌పోస్టులను ఏర్పాటు చేశారు. కంటెన ర్లు, లారీలు, గూడ్స్‌ వాహనాలు, అనుమానస్పద వాహనాలపై నిఘా ఉంచి పోలీసులు సోదా లు చేపట్టారు. సామాజిక మాద్యమాల్లో వచ్చే ఫిర్యా దులు సైతం స్వీకరించి, మూగ జీవాల రక్షణకు చర్యలు చేపట్టారు. గతేడాదిలో జరిగిన హింసాత్మక ఘటనలు, అల్లర్ల కేసులపై ఆరా తీస్తున్నారు. ముస్లిం మత పెద్దలతో శాంతియుత సమావేశాలు నిర్వహించి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నారు.

పూల్లూరు, బల్గెర, కేటీదొడ్డి అంతరాష్ట్ర సరిహద్దుల వద్ద హై అలర్ట్‌

అనుమతులు ఉంటేనే తరలింపు

అవకాశం

ఎస్పీ ఆధ్వర్యంలో నిరంతరం పర్యవేక్షణ

గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం భారంగా అనుకునే రైతులు తమ ఎద్దులు, ఆవులను పోషించే స్థోమత లేకపోవడంతో వాటిని విక్రయిస్తున్నారు. వ్యాపారులు ఇదే అదనుగా భావించి వాటిని చౌక ధరలకు రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నారు. వివిధ రాష్ట్రాలకు ఎగుమతి లేదా కబేళాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. తరలింపునకు ఎలాంటి అనుమతి లేకుండా గుట్టుగా వ్యవహారం కొనసాగిస్తున్నారు. పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన మూగ జీవాలను దగ్గరలోని గోశాలలకు తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement