గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాలు | - | Sakshi
Sakshi News home page

గ్రంథాలయాలు జ్ఞాన భాండాగారాలు

May 16 2026 12:57 AM | Updated on May 16 2026 12:57 AM

గద్వాల: గ్రంథాయలంలోని పత్రికలు, పుస్తకాలను పాఠకులు, విద్యార్థులు, నిరుద్యోగులు సద్వినియో గం చేసుకోవాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నా రు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల షె డ్యూల్‌లో భాగంగా నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరైయ్యారు. ముందు గా సరస్వతి దేవి చిత్రపటానికి పూలమాల వేసి జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం కలెక్టర్‌ గ్రంథాలయంలోని వివిధ విభాగాలను పరిశీలించి విద్యార్థులకు, నిరుద్యోగులకు అవసరమైన పుస్తకాలు అందుబాటులో ఉంచుతామన్నారు. గ్రూప్స్‌, బ్యాంకింగ్‌, టీచర్‌ తదితర ఉద్యోగాలకు ప్రిపేర్‌ అయ్యే నిరుద్యోగులు పక్కా ప్రణాళికతో లక్ష్యాలకు అనుగుణంగా చదివితే పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారని తెలిపారు. ఒకే నోటిఫికేషన్‌ కోసం కాకుండా నిరుద్యోగులు తాము చదివిన కోర్సులకు అనుబంధంగా ఉండే ఇతర ఉద్యోగాల కోసం కూడా సాధన చేస్తే ప్ర యోజనం చేకూరుతుందని పేర్కొన్నారు. గ్రంథాల య భవన నిర్మాణం పూర్తయ్యే వరకు ప్రస్తుతంనిర్వ హిస్తున్న గ్రంథాలయాన్ని సమీపంలో ఉన్న పాతకోర్టు భవనంలోకి మార్చడానికి సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. నూతన భవ న నిర్మాణానికి ప్రస్తుతం ఉన్న నిధులతో పాటు ఎంపీ, తన నిధులు కేటాయిస్తానన్నారు.కార్యక్రమంలో గ్రంథాలయ చైర్మన్‌ నీలి శ్రీనివాసులు,డీఈఓ విజయలక్ష్మి,లైబ్రేరియన్‌ రామాంజనేయులు పాల్గొన్నారు.

అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలి

జిల్లాలో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్లో వేగం పెంచి, త్వరగా పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఐడీఓసీ కార్యాలయంలోని కాన్ఫరెన్స్‌ హాల్‌లో అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ నిధులతో చేపట్టిన ఆయా పనులను రెండు నెలల్లో పూర్తి చేయాలన్నారు. రూసా, నాబార్డ్‌, నేషనల్‌ హెల్త్‌ మిషన్‌, కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ తదితర నిధు లతో చేపట్టాల్సిన పనులు పెండింగ్‌లో ఉంచకుండా, టెండర్స్‌ పూర్తి చేసి పనులు ప్రారంభించేలా చ ర్యలు తీసుకోవాలన్నారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌, మెడికల్‌ కాలేజీ భవనం, ఇతర నిర్మాణాల్లో వేగం పెంచాలన్నారు. కేజీబీవీలో అండర్‌గ్రౌండ్‌ డ్రెయినేజీ సమస్యను పరిష్కరించేందుకు ప్రతిపాదనలు చేసి పంపాలన్నారు. పీఎం శ్రీ నిధు లతో ఆయా పాఠశాల్లో చేపట్టాల్సిన లైబ్రరీ, కంప్యూటర్‌ ల్యాబ్‌, మరుగుదొడ్ల నిర్మాణ పనులు నిర్ధేశిత కాలపరిమితిలో పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ నర్సింగ్‌రావు, ఈఈలు, ఏఈలు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement