ధరూరు: ఏళ్లుగా సాకారం కాని పేదల సొంతింటి కల ఇందిరమ్మ ఇంటితో నెరవేరుతుందని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన మండలంలోని పారుచర్లలో సావిత్రి, సుజాత ఇందిరమ్మ ఇళ్లను ఆయన స్థానిక నాయకుడు సురేందర్‌రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా మ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇందిరమ్మ ఇంటి పథకం పేద వర్గాల్లో ఆనందం నింపిందన్నారు. ప్రతి ఒక్కరికీ సొంత ఇళ్లు ఉండాలన్న లక్ష్యంతో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి పనిచేస్తున్నారని కొనియాడారు. కార్యక్రమంలో మాజీ వైస్ ఎంపీపీ సుదర్శన్‌రెడ్డి, నాయకులు జంబు రామన్‌గౌడ్, సురేందర్‌రెడ్డి, ఎంపీడీఓ కృష్ణమోహన్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
పగిలిన మిషన్ భగీరథ పైప్‌లైన్
అమరచింత: మిషన్ భగీరథ ప్రధాన పైప్‌లైన్ పగలడంతో ఆత్మకూర్, అమరచింత, చిన్నచింతకుంట, మదనాపురం మండలాల్లోని 30 గ్రా మాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. మదనాపురం మండలంలోని గోపాన్‌పేట వద్ద ఓ రైతు తన పొలం దుక్కి దున్నుతుండగా పైప్‌లైన్ పగిలి తాగునీరు వృథాగా పారింది. విషయం తెలుసుకున్న మిషన్ భగీరథ అధికారులు వెంటనే నీటి సరఫరా నిలిపివేసి మరమ్మతులను యుద్ధప్రాతిపదికన చేపడుతున్నారు. ఈఈ అంజద్‌పాషా, డీఈ విజయ్‌కుమార్ క్షేత్రస్థాయిలో పరిశీలించి కొనసాగుతున్న మరమ్మ తు పనులను పరిశీలించారు. త్వరగా పూర్తిచేసి నీటి సరఫరాలో ఇబ్బందులు కలగకుండా చూ డాలని సిబ్బందిని ఆదేశించారు. ప్రధాన పైప్ లైన్ పగలడంతో అమరచింత, ఆత్మకూర్ పురపాలికలతో ఆత్మకూర్ మండలంలోని పిన్నంచర్ల, బాలకిష్టాపూర్, మూలమల్ల, మదనాపు రం మండలంలో మదనాపురంతో పాటు కొత్తపల్లి, దుప్పల్లి, గోపన్‌పేట, కర్వెన, భగత్‌సింగ్‌తండా, అమరచింత మండలంలోని సింగంపేట, మస్తీపురం, చంద్రప్పతండా, పాంరెడ్డిపల్లి తండా, కొంకన్వానిపల్లి, చిన్నచింతకుంట మండలంలోని అల్లీపురం, కురుమూర్తి, అ మ్మాపురం, గూడూరు, తిరుమలాపురం, దాస రపల్లి, అప్పంపల్లి, ముచ్చింతల, చిన్నచింతకుంట, మద్దూరు, ఎదులాపురం గ్రామాల్లో శుక్రవారం నీటి సరఫరా నిలిచింది. అసలే వేస వి కాలం అందులోనూ నీటి సరఫరా నిలిచిపోవడంతో ఆయా గ్రామాల ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మరమ్మతులు పూర్తిచేసి వెంటనే నీటి సరఫరాను పునరుద్ధరించాలని కోరుతున్నారు.


