ఐదు రాష్ట్రాల ఎన్నికలు అయిపోగానే పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుతార ని సీపీఎంతో సహా ఇతర పార్టీలు ముందుగానే చెప్పాయి. అయితే దీనిని ప్రతిపక్షాల ఆరోపణలు అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి ఖండించారు. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి, సామాన్యుల నడ్డి విరుస్తున్నారు. దీనిపై కేంద్ర మంత్రి బేషరత్‌గా ప్రజలకు క్షమాపణ చెప్పి రేట్లు తగ్గించాలి.
– వెంకటస్వామి, సీపీఎం జిల్లా కార్యదర్శి
విశ్వగురువుగా చెప్పుకునే ప్రధాని మోదీ నిత్యవసరాలు మొదలుకుని పెట్రోలు, డీజిల్ ధరల వరకు పెంచడమే లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటికే గ్యాస్, ఇంధనాల కొరతతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే తాజాగా వాటిపై ధరలు పెంచి మరో బాంబు వేశారు. ప్రజలపై భారం పడకుండా తక్షణమే రేట్లు తగ్గించాలి. లేదంటే ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం.
– ఆంజనేయులు సీపీఐ జిల్లా కార్యదర్శి
పశ్చిమ దేశాల్లో జరుగుతున్న యుద్ధాలతో అన్ని రంగాల్లో నష్టాలు వాటిల్లి వాటి ప్రభావం ప్రజలపై పడుతుంది. తాజాగా కేంద్రం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడం వలన సామాన్యులపై తీవ్ర ఆర్థిక భారం పడుతుంది. ప్రజలపై పడుతున్న దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పునరాలోచించాలి.
– కోళ్ల హుస్సేన్, గద్వాల


