ఆది నుంచి అదే తీరు.. | - | Sakshi
Sakshi News home page

ఆది నుంచి అదే తీరు..

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

సివిల్‌ సప్లయ్‌శాఖ అంటేనే జిల్లాలో ఆదినుంచి అవినీతికి కేరాఫ్‌ అడ్రస్‌గా మారింది. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో ఽమిల్లర్లకు కేటాయింంచినఽ ధాన్యం వ్యవహారంలో చోటుచేసుకున్న అవినీతి అక్రమాలపై రాష్ట్ర విజిలెన్స్‌ విచారణ జరిగింది. రెవెన్యూశాఖలో పనిచేసిన జిల్లాస్థాయి అధికారి, సివిల్‌సప్లయ్‌శాఖ డీఎస్‌ఓ, ఆర్‌ఐ, కంప్యూటర్‌ ఆపరేటర్‌, పోలీసుశాఖలోని సీఐ, ఎస్‌ఐ స్థాయి అధికారుల పాత్ర ఉందని విచారణలో వెలుగుచూడటం అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపగా.. అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారిపై బదిలీ వేటు పడింది. మిగిలిన అధికారులపై సస్పెన్షన్‌ వేటు వేశారు.

చర్యలు తీసుకుంటాం..

ధాన్యం కేటాయింపు ప్రక్రియ గతంలో కొంత అస్తవ్యస్తంగా ఉంది. ఇటీవలే నేను కొత్త గా వచ్చాను కాబట్టి సమగ్రంగా తెలియ దు. ఇదే అంశంపై కలెక్టర్‌ సీరియస్‌గా ఉన్నా రు. మొత్తం వ్యవస్థను గాడినపెట్టాలంటే కొంత సమయం పడుతుంది. ప్రస్తుతం ధాన్యం కొనుగోలు ప్రక్రియ కొనసాగుతుంది. ఈ ప్ర క్రియ సజావుగా జరిగేలా అవసరమైన చర్య లు తీసుకుంటున్నాం. మీరు చెబుతున్నట్లు గతంలో జరిగిన ధాన్యం కేటాయింపులపై విచారణ జరిపి, నిబంధనలకు విరుద్ధంగా ఎక్కడైనా అక్రమాలు జరిగినట్లు రుజువైతే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – మధుమోహన్‌, అదనపు కలెక్టర్‌

Advertisement
 
Advertisement
Advertisement