గద్వాల జిల్లా పరిధిలోని కొత్తపల్లి వైపు ముందుగా పిల్లర్ల నిర్మాణాలు చేపడుతున్నాం. ఇదివరకే మూడు పిల్లర్ల పనులు చేపట్టాం. వరద నీరు వచ్చేలోగా కొత్తపల్లి వైపు నిర్మాణాలు పూర్తి చేసేలా ముందుకెళ్తున్నాం. జూరాల వైపు వరద వచ్చినా పనులు చేపట్టేందుకు అవకాశం ఉంది. ఏడాదిన్నరలోగా పనులు పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకుంటున్నాం.
– దేశ్యానాయక్, ఈఈ, ఆర్‌అండ్‌బీ, వనపర్తి
ఆనందంగా ఉంది..
గద్వాల మండలం కొత్తపల్లి సమీపంలో కృష్ణానదిపై వంతెన నిర్మిస్తారని చిన్నతనం నుంచి వింటున్నాం. ప్రస్తుతం మా గ్రామం మీదుగా రాకపోకలు కొనసాగుతుండటంతో ఆనందంగా ఉంది. ఎన్నో ఏళ్లనాటి కల సాకారం చేస్తున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి రుణపడి ఉంటాం. – మహేశ్వర్‌రెడ్డి, మాజీ సర్పంచ్, కొత్తపల్లి, గద్వాల
●


