మెరుగైన విద్య అందించడమే లక్ష్యం | - | Sakshi
Sakshi News home page

మెరుగైన విద్య అందించడమే లక్ష్యం

May 15 2026 10:38 AM | Updated on May 15 2026 10:38 AM

మల్దకల్‌: ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లో విద్యార్థులకు మెరుగైన విద్య అందించి.. వారి ఉజ్వల భవిష్యత్‌ను తీర్చిదిద్దడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని డీఐఈఓ హృదయరాజు అన్నారు. గురువారం మల్దకల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ప్రిన్సిపాల్‌ శ్రీలతరెడ్డి అధ్యక్షతన విద్యార్థుల తల్లిదండ్రులతో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంటర్‌ విద్య విద్యార్థులకు ఎంతో కీలకమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల చదువును మధ్యలోనే మాన్పించి పనులకు తీసుకెళ్లొద్దని సూచించారు. ప్రభుత్వ కళాశాలల్లో చదివే విద్యార్థులకు అనుభవజ్ఞులైన అధ్యాపకులతో మెరుగైన విద్య అందించడంతో పాటు అన్ని వసతులు కల్పిస్తున్నట్లు వివరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ కళాశాలల్లో చేర్పించాలని కోరారు. సమావేశంలో డా.నవీన్‌కుమార్‌, సర్పంచ్‌ చిట్టెమ్మ, పద్మ, అధ్యాపకులు రామాంజనేయులుగౌడ్‌, భాగ్యలక్ష్మి, రాఘవేంద్ర, రంగస్వామి, నీలవేణి ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement